ఏటీఎం మనీ విత్ డ్రాలో కొత్తగా వచ్చిన మార్పేంటో తెలుసా? ఇది లేకపోతే అంతే ఇక..!

బ్యాంకింగ్ రంగం తమ కస్టమర్ల కోసం అనేక రకాల సర్వీసులను ప్రవేశపెడుతూ వస్తోంది. బ్యాంక్ అకౌంట్ తీయడం నుంచి డబ్బులను విత్ డ్రా చేసుకోవడం మొదలు ఈజీగా ఉండే సర్వీసులను తీసుకొస్తూనే ఉన్నాయి. దీనితో పాటు భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇంకా ఎన్నో రకాల సేవలను అందించేందుకు కూడా బ్యాంకులు ముందున్నాయి. అయితే ప్రభుత్వ రంగానికి చెందిన అతిపెద్ద రెండో బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్.. ఏటీఎం నుంచి మనీ విత్ డ్రా చేసుకోవడంలో సరికొత్త రూల్స్ ను ప్రవేశపెట్టింది.

 

ఈ బ్యాంక్ రేపటి నుంచి ఏటీఎం కు సంబంధించి కొత్త రూల్స్ ను అమలులోకి తీసుకురావడానికి సిద్ధమైంది. ఈ కొత్త రూల్ ప్రకారం ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకోవాలనుకునే వారు ఖచ్చితంగా వారి వెంట మొబైల్ ఫోన్ ను వెంటబెట్టుకుని వెళ్లాల్సి ఉంటుంది. మొబైల్ ఫోన్ ఎందుకంటే ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేయాలంటే మీ ఫోన్ కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తేనే మీకు డబ్బులు వస్తాయి గనక.

ఓటీపీని గనక ఎంటర్ చేయనట్లైతే మీరు విత్ డ్రా చేసిన డబ్బులు రావు. అయితే ఓటీపీ ద్వారా డబ్బులు విత్ డ్రా చేయాలంటే మాత్రం రూ.10 వేలకు పైనే క్యాష్ ను విత్ డ్రా చేయాల్సి ఉంటుంది. కాని చిన్న చిన్న లావాదేవీలకు ఈ రూల్ ను పాటించనవసరం లేదు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రకటించింది. అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ ట్వీట్ ప్రకారం.. ప్రతిరోజూ మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ రూల్స్ వర్తిస్తాయి.

ఆ సమయాల్లో కస్టమర్ ఏటీఎం నుంచి రూ.10 వేలకు పేనే క్యాష్ ను విత్ డ్రా చేసుకొనే ఫెసిలిటీని కల్పిస్తుంది పీఎన్ బీ బ్యాంక్. అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లు డెబిట్ కార్డుల ద్వారా ఇతర బ్యాంక్ ఏటీఎం ద్వారా క్యాష్ ను విత్ డ్రా చేస్తే మాత్రం ఈ రూల్స్ వర్తించవని స్పష్టం చేసింది. తమ బ్యాంక్ కస్టమర్లు తమ బ్యాంక్ ఏటీఎం ద్వారా మాత్రమే క్యాష్ విత్ డ్రా చేసుకుని ఈ రూల్స్ ను పాటించాలని పంజాబీ నేషనల్ బ్యాంక్ తమ కస్టమర్లకు సలహానిచ్చింది.