ఎలుకను చంపబోయి తన ప్రాణాలను కోల్పోయిన యువతి!

Share

సాధారణంగా మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల పెద్ద ప్రమాదం వాటిల్లుతుంది. కొన్నిసార్లు ఆ ప్రమాదం మరణానికి కూడా దారి తీయవచ్చు. ఇలాంటి చిన్న తప్పిదం వల్లే ఓ మహిళ నిండు ప్రాణాలను బలి తీసుకుంది. ఇంట్లో ఎలుకల బెడద ఎక్కువగా ఉందని భావించిన ఆ యువతి ఎలుకలను చంపడానికి ప్రయత్నించి, తన ప్రాణాలను బలి తీసుకున్న సంఘటన ఛత్తీస్‌గఢ్‌ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే….

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని భిలాయ్దుర్గ్‌ దీపారాపారా గ్రామంలో పాయల్ సాహు అనే యువతి తన ఇంట్లో ఎలుకలు ఎక్కువగా ఉన్నాయని, వాటిని చంపడానికి రెండు టమోటా పండ్లలో ఎలుకల మందు పెట్టింది. అయితే ఏదో పనిలో నిమగ్నమైన ఆ యువతి టమోటా పండ్లలో ఎలకల మందు పెట్టిన విషయాన్ని మరిచి పోయింది. అలా మర్చిపోవడంతో ఆ టమాట పండ్లను తినడం వల్ల తన ప్రాణాలను పోగొట్టుకుంది.

పాయల్ సాహుఅనే యువతి ఇతర పనుల్లో బిజీగా ఉండడంతో మర్చిపోయి మందు కలిపిన టమోటో పండ్లతో చేసిన సలాడ్ తాగిన వెంటనే వాంతులు అయ్యాయి. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆ యువతిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యంలోనే ప్రాణాలను కోల్పోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఈ మృతిని పోలీసులు అనుమానస్పద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఈ యువతి మృతి విషయంలో కుటుంబ సభ్యులు కొన్ని నిజాలను దాస్తున్నారని అనుమానం పోలీసులకు రావడంతో వారి కుటుంబ సభ్యుల పై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ యువతి ఎలుకల మందు వల్ల చనిపోయిందా ?లేక మరేమైనా కారణాలున్నాయా? అన్న కోణంలో పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. అయితే దర్యాప్తు తర్వాతే అసలు విషయాలు బయట పడతాయని పోలీసులు తెలియజేశారు.


Share

Related posts

Eye Problems: కంటి ఆరోగ్యానికి తీసుకోవాల్సిన ఆహారం ఇవే..!!

bharani jella

Raja Vikramarka:  కార్తికేయ “రాజా విక్రమార్క” ఫస్ట్ లుక్..!! అభిమానానికి మించిన అర్హత ఏముంది..!!

bharani jella

Family Man 2: ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన ఫ్యామిలీ మ్యాన్2 మేకర్స్..!!

bharani jella