‘పూజ హెగ్డే’లో ‘ఆ యాంగిల్’ ఇప్పటివరకూ మనం ఎవ్వరు చూడలేదు.. కుమ్మెసిందిగా!

పూజ హెగ్డే.. ఈమె గురించి.. ఈమె అందం గురించి.. నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో ఎంతో అద్భుతంగా నటించిన ఈ భామ మొదట్లో అడ్వేర్టైజ్మెంట్ లో వచ్చి అక్కినేని వారసుడుతో కలిసి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయినా ఈ భామ తీసిన సినిమాలు అన్ని హిట్ అవుతూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

 

అలా వైకుంఠపురం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇక అలాంటి ఈ భామకు వరుసగా అవకాశాలు వచ్చాయ్. ప్రస్తుతం ప్రభాస్ తో రాధేశ్యామ్ సినిమాలో నటిస్తున్న ఈ భామ అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో కూడా నటిస్తుంది. అయితే ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా సెట్స్ పైకి వచ్చింది.

Pooja Hegde Doing Stand Up Comedian Character In Most Eligible Bachelor

కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా చాల రోజుల తర్వాత షూటింగ్ మొదలవడంతో యూనిట్ అంత ఫుల్ జోష్ గా ఉంది. షూటింగ్ సమయంలో అఖిల్, పూజ హెగ్డే బాగా సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొన్న ఈ మధ్య దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ పుట్టినరోజు కావడంతో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో ఆమె పాత్ర ఏంటో రివీల్ చేసేసింది. స్టాండప్ కామెడీ చేసే అమ్మాయిగా పూజ హెగ్డే నటించనున్నట్టు ఆమె పాత్రను రివీల్ చేసింది. మరి ఈ పాత్రతో ఎంతమందిని ఆకట్టుకుంటుందో చూడాలి.