ఒక్కప్పుడు దేశ రాజకీయాల మీద మాట్లాడే నటులు చాలా తక్కువ. అలా మాట్లాడారంటే వాళ్లు రాజకీయాల్లోకి రాబోతున్నారనే అనుమానం వచ్చేది. కానీ ఇప్పుడు మార్పు వచ్చింది. ఏ చిన్న సమస్య వచ్చిన, ఏ చిన్న కామెంట్ చేసిన పలువురు నటులు వెంటనే స్పందిస్తున్నారు. తమ మద్దతును తమకు నచ్చిన వారికి తెలుపుతున్నారు.
అయితే ఇలాంటి విషయాల్లో పలు ట్వీట్ లు చేసి వార్తల్లోకి ఎక్కిన నటి పూనమ్ కౌర్. ఈ టాలీవుడ్ నటి సినిమాలో నటించే సమయం కన్న సోషల్ మీడియాలోకి వచ్చిన తరువాత బాగా పాపులర్ అయ్యింది. ఈ యాక్టర్ కు అంత పాపులారిటీ తీసుకొచ్చిన విషయాలు మాత్రం పవన్ కళ్యాణ్ విషయాలే. ఈ స్టార్ హీరోను ప్రధానంగా చేసుకుని పలు ట్వీట్లు చేసింది ఈ చిన్నది. ఈ ట్వీట్లల్లో కొన్నిసార్లు అనుకూలంగా కొన్నిసార్లు వ్యతిరేకంగా మాట్లాడింది.
వీటివల్ల కొన్ని సార్లు పవన్ ఫ్యాన్స్ నుంచి భారీ విమర్శలే ఎదుర్కొందని చెప్పాలి. అయితే.. మరోసారి పూనమ్ కౌర్ పవన్ కళ్యాణ్ తో ముడిపడిన ఒక విషయంపై ఆమె మాట్లాడింది. అయితే సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఇటీవల పవన్ కళ్యాణ్ రాజకీయ విధానాల గురించి పలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద వార్ జరిగిన సంగతి కూడా తెలిసిందే.
ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్న పలు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు కదా..! ఈ ఆందోళనలకు సినీ నటుడు ప్రకాష్ రాజ్ తన మద్దతు ప్రకటించారు. అయితే దీనిపై పూనమ్ కౌర్ పలు వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకుడు, నటుడైన వ్యక్తి గురించి ప్రకాష్ రాజ్ మాట్లాడితే.. పెద్ద చర్యనీయాంశం అయ్యింది. కానీ రైతుల గురించి మాట్లాడితే ఎవరు పట్టించుకోవడం లేదని.. ఇది హిపోక్రసి కాదా’ అంటూ పూనమ్ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ కు నటుడు ప్రకాష్ రాజ్ కూడా స్పందించారు. ఇది అటు ఉంచితే.. పేరు చెప్పకుండా.. వివాదాలను ప్రశ్నించిన పూనమ్ పవన్ కళ్యాన్ నే టార్గెట్ చేసి ఈ వ్యాఖ్యలు చేసిందని పలువురు విశ్లేషకులు అనుకుంటున్నారు. అయితే ఈ విషయంపై ఎవరు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. లేక ఆమె పవన్ ను కాకుండా వేరే ఎవరిని ఉద్దేశించి ఇలా వ్యాఖ్యలు చేసిందో.. ఆమె చెప్పేవరకు ఆగాలని పలువురు అనుకుంటున్నారు.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!