Balakrishna: నందమూరి బాలయ్య బాబు ప్రస్తుతం మంచి జోరుమీద ఉన్న సంగతి తెలిసిందే. అఖండ సూపర్ డూపర్ హిట్ కావడంతో… పాటూ ఇటీవల 100 రోజుల ఫంక్షన్ కూడా కర్నూలులో జరపడం జరిగింది. “అఖండ” రిలీజ్ కి ముందు బాలకృష్ణ వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. అయితే అఖండ భారీ విజయం సాధించడంతో… బాలయ్య అదేవిధంగా నందమూరి అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇదిలావుంటే ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ పూనమ్ కౌర్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా యాంకర్.. ఇండస్ట్రీలో హీరోల ఫోటోలు చూపిస్తూ… తమ అభిప్రాయాన్ని తెలపాలని పూనం కౌర్ నీ అడగటం జరిగింది. మొట్టమొదటిగా మహేష్ బాబు ఫోటో కనిపించగానే పూనమ్ కౌర్ మంచి మానవత్వం మనసున్న వ్యక్తి, అనేకమంది చిన్నపిల్లల గుండె ఆపరేషన్ లు చేయించి వాళ్ళ ప్రాణాలను కాపాడటం జరిగింది. ఇష్టం సో మహేష్ అంటే చాలా గౌరవం అని తెలిపింది. ఆ తర్వాత బన్నీ ఫోటో రాగా తగ్గేదేలే అని అంది.
ఆ తర్వాత రామ్ చరణ్ ఫోటో రాగా జీవితాంతం సంతోషంగా ఉండాలని దీవిస్తూన్నట్లు పేర్కొంది. నెక్స్ట్ బాలకృష్ణ ఫోటో రాగా… మెన్షన్ హౌస్ అని సంచలన వ్యాఖ్యలు చేసింది. అంత మాత్రమే కాక బాలకృష్ణ సినిమాలో నటించే అవకాశం వచ్చిందని కానీ కొన్ని కారణాల వల్ల నటించలేదని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. బాలకృష్ణ గారు చిన్న పిల్లల మనస్తత్వం కలిగిన వ్యక్తి అని పేర్కొంది. ఇదే సమయంలో బాలకృష్ణ ఆహా లో అన్ స్తాపాబుల్ షో గురించి గొప్పగా చెప్పుకొచ్చింది. ఇంకా అనేక మంది హీరోల గురించి తనదైన శైలిలో పూనమ్ కౌర్ వ్యాఖ్యానించడం జరిగింది.