Project K: ప్రభాస్ – నాగ అశ్విన్ సినిమా షురూ..!!

Share

Project K: ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.. నేడు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళింది.. గురు పూర్ణిమ సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్లో లాంఛనంగా జరిగింది. ఈ వేడుకలో ప్రభాస్ తో పాటు బాలీవుడ్ అగ్రకథానాయకుడు అమితాబ్ బచ్చన్ కూడా పాల్గొన్నారు. ప్రభాస్ క్లాప్ కొట్టడం విశేషం..!!

Prabhas Nag Ashwin Project K: working title movie start
Prabhas Nag Ashwin Project K: working title movie start

Read More: Narappa: సినిమాలో వెంకటేష్ కొడుకు బయట కూడా అలాగే ఉంటాడట.. ఒకరోజు ఏమైందంటే..

క్లాప్ బోర్డ్ పట్టుకున్న ప్రభాస్ ఫోటోను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు మేకర్స్. ఇది ప్రారంభం. గురుపూర్ణిమ ప్రత్యేక రోజున మేము భారతీయ సినిమా గురువుతో ప్రారంభించాము అంటూ ట్వీట్ చేశారు. ఈ చిత్రం కోసమే ప్రత్యేకంగా అమితాబచ్చన్ నిన్న హైదరాబాదుకు వచ్చారు. ఇందులో బిగ్ బీ కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. 500 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ నిర్మిస్తోంది. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు స్క్రీన్ ప్లే పర్యవేక్షిస్తున్నారు.

 

ఈ సినిమా కోసం నాగ్ అశ్విన్ ఒక సంవత్సరం పైగా ప్రీప్రొడక్షన్ పనులు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమాకి “ప్రాజెక్ట్ కే” అనే వర్కింగ్ టైటిల్ ని ఫిక్స్ చేశారు. త్వరలోనే అధికారిక టైటిల్ ను ప్రకటించనున్నారు.. ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్, అదిపురుష్, సలార్ వరుస పాన్ ఇండియా సినిమాలు తో బిజీగా ఉన్నారు.. తాజాగా ఈ సినిమాను స్టార్ట్ చేసి అభిమానులను ఖుషి చేశారు..


Share

Related posts

Prabhas : ప్రభాస్ ‘ సలార్ ‘ సెకండ్ షెడ్యూల్ ని రామోజీఫిల్మ్ సిటీలో ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్..!

GRK

సీఎం క్యాంప్ ఆఫీసులోనే హైకోర్టు

somaraju sharma

Revanth Reddy: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలంటూ రేవంత్ ఘాటు వ్యాఖ్యలు

somaraju sharma