Maa Elections: వైయస్ జగన్ పై ప్రకాష్ రాజ్ సెన్సేషనల్ కామెంట్స్..!!

Share

Maa Elections: టాలీవుడ్ ఇండస్ట్రీలో “మా” అధ్యక్ష ఎన్నికలు నువ్వానేనా అన్నట్టుగా.. ప్రకాష్ రాజ్..విష్ణు ప్యానల్ సభ్యుల మధ్య పోటా పోటీ వాతావరణం ఏర్పడింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ మార్నింగ్ షో కలెక్షన్ ఎంత బడ్జెట్ విష్ణు సినిమాకి ఉండదని.. ప్రకాష్ రాజ్ ఎద్దేవా చేయడం తెలిసిందే. కాగా తాజాగా ప్రకాష్ రాజ్ ఇండస్ట్రీకి సంబంధించి.. ఎన్నికల విషయంలో బయట రాజకీయ నాయకులను ఎందుకు లాగుతున్నారని… విమర్శలు చేశారు. నరేష్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ మంచు విష్ణు ప్యానల్ లో ఉన్న సభ్యులందరికీ అంటే తెలుగు తాను బాగా మాట్లాడతానని సెటైర్లు వేశారు.

Your Film Budget Equals Pawan's Morning Show Collection', Prakash Raj To  Vishnu -

వైఎస్‌ జగన్‌ మీ బంధువైతే..??

అంత మాత్రమే కాక “మా” ఎన్నికలపై ప్రశ్నించినందుకు.. బెదిరించారని ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. మా’ ఎన్నికలలోకి జగన్‌, కేసీఆర్‌, బీజేపీని ఎందుకు లాగుతున్నారు ? ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మీ బంధువైతే. ‘మా’ ఎన్నికలకు వస్తారా ? రెండు సార్లు హలో చెబితే కేటీఆర్‌ ఫ్రెండ్‌ అయిపోతారా ? అని ప్రశ్నించారు. నరేష్ గర్వంగా మాట్లాడుతున్నారని అంత అహంకారం పూర్వకంగా మాట్లాడకూడదు అంటూ.. ప్రకాష్ రాజు వార్నింగ్ ఇచ్చారు. “మా” అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి విష్ణు ప్రకాష్ రాజు ప్యానల్ సభ్యుల మధ్య పోటా పోటీ వాతావరణం నువ్వానేనా అన్నట్టుగా ఉందన్న సంగతి తెలిసిందే.

Prakash Raj VS Naresh: 'నీళ్లు నింపకుండానే స్మిమ్మింగ్‌ పూల్‌లోకి  దూకమంటారా'?.. వైరల్‌ అవుతోన్న నరేశ్‌ ట్వీట్‌. | Twitter war between prakash  raj and naresh naresh counter on prakash ...

నరేష్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్లు

ఈ క్రమంలో ప్రస్తుత “మా” అధ్యక్షుడు నరేష్.. విష్ణు ప్యానల్ సభ్యులకు మద్దతిస్తున్నారు. ఈ తరుణంలో విష్ణు మద్దతుదారులు ప్రకాష్ రాజ్ ప్యానల్ నీ.. టార్గెట్ చేస్తూ… నాన్ లోకల్.. నినాదాన్ని తెరపైకి తెచ్చారు. ఇక ఇదే తరుణంలో ఇటీవల నరేష్ కూడా నాన్ లోకల్ టాలీవుడ్ ఇండస్ట్రీకి అనవసరమని… కామెంట్లు చేయడంతో నరేష్ చేసిన వ్యాఖ్యలకు ఈ తరహా లో ప్రకాష్ రాజ్ తన దైన శైలిలో కౌంటర్లు వేశారు. అక్టోబర్ 10 వ తారీఖున మా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఇండస్ట్రీలో సరికొత్త వాతావరణం ఏర్పడింది. మా అధ్యక్ష పదవికి పోటీ చేసే పోటీదారులు ఎవరికి వారు ప్రముఖుల మద్దతు కూడగట్టుకోవడానికి.. తీవ్రంగా కృషి చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ కి.. మెగా కాంపౌండ్ ఉన్నట్లు టాక్ వస్తుండగా, విష్ణుకి బాలకృష్ణతో పాటు మరి కొంత మంది ప్రముఖుల సపోర్టు ఉన్నట్లు టాక్ నడుస్తుంది. మరి ఈ అధ్యక్ష ఎన్నికలలో ఎవరు గెలుస్తారో చూడాలి.


Share

Related posts

ఇది కదా మెగాస్టార్ నుంచి అందరు కావాలని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసేది ..?

GRK

ప్రారంభమన ఏపి కేబినెట్ సమావేశం

somaraju sharma

#NS22: నాగశౌర్య 22వ చిత్ర షూటింగ్ పోస్టర్ వైరల్..!!

bharani jella