Prasanth Varma: క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.. నేడు ప్రశాంత్ వర్మ పుట్టినరోజు సందర్భంగా గా తన నాలుగవ సినిమా టైటిల్ ను ప్రకటించారు.. “హనుమాన్” అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారి సూపర్ హీరో సినిమాగా నిలుస్తుందని పేర్కొన్నారు.

‘అ’ సినిమాతో డైరెక్టర్ గా తెలుగు తెరకు పరిచయమయ్యాడు ప్రశాంత్ వర్మ.. ఈ సినిమాకు నేషనల్ అవార్డ్ రావడం మరో విశేషం. ఆ తర్వాత రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటించిన కల్కి సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించింది.. తేజ సజ్జలు హీరోగా పరిచయం చేసిన జాంబిరెడ్డి సినిమాతో ముచ్చటగా మూడోసారి ప్రేక్షకులను అలరించాడు ఇప్పుడు ఇదే జోరు తో తన నాలుగు సినిమా మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు చేస్తూనే తెలుగులో ఇదే మొదటి ఒరిజినల్ సూపర్ హీరో ఫిలిం అని ప్రకటించడంతో ఈ సినిమాపై ఇప్పటి నుంచే పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాడు..ఈ చిత్ర టైటిల్ మోషన్ పోస్ట్రర్ విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాతో ప్రశాంత్ వర్మ ఏ మేరకు ప్రేక్షకులను మెప్పిస్తాడో చూడాలి. ఈ సినిమాలో నటించే తారాగణం, మిగతా సిబ్బంది వివరాలు ప్రస్తుతానికి ప్రకటించలేదు.