Winter: చలికాలం వచ్చేసింది.. సీజన్ మారినప్పుడుల్లా ఆ కాలానుగుణంగా ఆరోగ్య సమస్యలు వస్తాయి.. చలికాలంలో ముఖ్యంగా దగ్గు, జలుబు, ఫ్లూ, ఆస్తమా, ఆయాసం, ఉబ్బసం వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి.. ఈ సీజన్లో అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..!!
Winter: ఇవి తాగండి చాలు..!!
చలికాలంలో గోరువెచ్చటి నీళ్లు పోసుకుని తాగుతూ ఉండాలి గోరువెచ్చటి నీళ్లు ఎక్కువగా సేవిస్తూ ఉండాలి శరీరం వాతావరణానికి చల్ల పడుతూ ఉంటుంది కాబట్టి వేడి వేడిగా ఉండే ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి. కాఫీ, టీ, కషాయం తయారు చేసుకొని తాగాలి. కెఫిన్ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవడం వల్ల మన మూడ్ ను చేంజ్ చేస్తుంది. ఇమ్యూనిటీ పవర్ ను పెంచే ఆహార పదార్థాలను మీ డైట్ లో భాగంగా చేసుకోవాలి. శరీరం వెచ్చగా ఉండే దుస్తులను మాత్రమే ధరించాలి.
చలి గా ఉండటం వలన ఎక్కువగా ఆకలి చేస్తూ ఉంటుంది . ఎక్కువగా తినటం వలన అనేక ఆరోగ్య సమస్యలు పడతామని గుర్తుంచుకోవాలి. ఈ కాలంలో చెమట ఎక్కువగా పట్టడం శరీరంలోని శక్తి ఎక్కువగా ఖర్చు అవ్వదు. కాబట్టి లిమిట్ గా ఆహారం తినాలి. చలికాలంలో చాలా మంది నీళ్లు తాగడం అశ్రద్ధ చేస్తూ ఉంటారు.. మీరు ఎక్కువగా నీళ్లు తాగకపోతే డీహైడ్రేషన్ కి గురయి కిడ్నీ సమస్యలు, అజీర్తి వస్తాయి. చలికాలంలో ఎక్కువగా యూరిన్ కి వెళ్ళాల్సి వస్తుంది . మీరు నీటిని ఎక్కువగా తీసుకోకపోతే అనేక ఆరోగ్య సమస్యలు రావచ్చు. అది గుర్తుంచుకొని నీటిని ఎక్కువగా తాగుతూ ఉండాలి. చలికాలంలో కూల్ డ్రింక్స్ , చల్లటి పానీయాలు, చల్లటి ఆహారాలు జోలికి వెళ్ళవద్దు.