గర్భిణీ స్రీలు మెట్లు ఎక్కవచ్చ అనే సందేహం చాలామందిలో ఉంటుంది.డాక్టర్ బెడ్ రెస్ట్ తీసుకోమన్నట్లయితే ,అసలుఎక్కకూడదు.డాక్టర్అలాటి సలహా ఇవ్వని గర్భిణీలు కూడా మెట్లు ఎక్కవద్దని మన పెద్దవాళ్ళు చెప్తున్నా మాట . గర్భం దాల్చిన చివరి త్రేమాసికంలో(ఇరవై తొమ్మిది వారాల నుండి నలబై వారాల వరకు మూడవ త్రైమాసికం అంటారు. ) గర్భం చాల పెద్దదిగా ఉండటం, వలన మెట్లు ఎక్కడం కష్టం అవుతుంది.ఈ సమయం లోమెట్లు ఎక్కితే జారిపోవచ్చు.అప్పుడు గర్భానికి పెద్దసమస్యగా అవ్వవచ్చు.
గర్భధారణ ప్రారంభములోనే అడుగులు వేయటం ,గర్భధారణ సమయం లో మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది ,అని
అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ అధ్యయనం ప్రకారం తేలింది .
అయితే కొన్ని సురక్షిత చర్యలు తీసుకుని మాత్రమే మెట్లు ఎక్కాలని సూచించారు . ఒక వేళా గర్భధారణ సమయం లో మెట్లు ఎక్కవలిసి వస్తే ,ఈ జాగ్రత్తలు పాటించాలి. మీరు మెట్లు ఎక్కి కిందకు వచ్చేటప్పుడు ఇనుప డ్రిల్ల్ వైపు పట్టుకోండి.ఒకవేళ చేతిలో సామాను ఉంటే, మరొక చేతితో డ్రిల్ల్ పట్టుకోండి.మెట్లమీద వెలుతురుగా ఉండేటట్టు చూసుకోండి.
ఎట్టి పరిస్థితి లోకూడా చీకటి లో మెట్లు ఎక్కకండి.మెట్ల మీద తివాచీ ఉంటె అది సరిగా ఉందొ లేదో చూసుకుంటూ ఉండండి. అది సరిగా లేకపోతె జారిపోయే ప్రమాదం ఉంది.మెట్లు ఎక్కితే నేమ్మది గా నడవండి. తొందర అస్సలు పనికి రాదు.మెట్లమీద నీటి నిలవ కానీ తడి కానీ లేకుండా చూసుకోవాలి.పొడవాటి దుస్తులు ధరించవద్దు.అలా వేసుకుంటే కాళ్ళకి అడ్డుపడి పడిపోయే ప్రమాదం ఉంది.సుఖంగా , ఎలాంటి ఆందోళన లేకపోతే మీకు ఎలాంటి సమస్య లేకపోతే మెట్లు ఎక్కవచ్చు.కానీ డ్రిల్ పట్టుకోకుండా ఎక్కవద్దు, దిగవద్దు.