Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో.. హౌస్ లో బాగా ఎంటర్టైన్ చేస్తున్న వారిలో ముందు వరుసలో ఉన్నారు లోబో. ఎవరి ట్రాప్లో పడకుండా.. అందరినీ ఎంటర్టైన్ చేస్తూ.. ఆడుతున్న లోబో… ఎవరికైనా ప్రమాదం వచ్చిన టైంలో పాయింట్ టు పాయింట్ మాట్లాడుతూ.. మొహం మీద తన విషయాన్ని చెప్పేస్తున్నాడు. ఈ క్రమంలో లోబో.. ఆట తీరు చూసి యాంకర్ నాగార్జున కూడా మొదటి వీకెండ్ ఎపిసోడ్ లో ప్రశంసించడం జరిగింది. చాలావరకు హౌస్ లో అందరి మన్ననలను పొందుతున్న లోబో…పై తాజాగా ప్రియాంక సింగ్… కాజల్, సిరి దగ్గర కాంట్రవర్సీ కామెంట్ చేయడం జరిగింది.
మంగళవారం జరిగిన ఎపిసోడ్ లో.. నామినేషన్ అనంతరం.. ప్రియాంక సింగ్, కాజల్, సిరి ముగ్గురు కూర్చుని మాట్లాడుకుంటున్న సమయంలో ప్రియాంక సింగ్…లోబో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది. ‘నిన్న హాఫ్ ఫిట్ డ్రెస్ వేసుకున్నాను. అది కొంచెం అన్ కంఫర్టబుల్గా అనిపించింది. కానీ వీలైనంతవరకు కవర్ చేసుకుంటూనే ఉన్నాను. అక్కడ నేను ఏదో మాట్లాడుతూ ఉంటే లోబో నన్ను చూసి సైగలు చేశాడు. నాకర్థమైంది. నా కవరింగ్ నేను చేసుకుంటున్నాను.
అంతలో సడన్గా వచ్చి చేయి పెట్టాడు. ఫన్నీగానే తీసుకున్నాను, కానీ వెంటనే డ్రెస్ మార్చేసుకున్నాను’ అని చెప్తూ బాధపడింది. ఇది విని షాకైన కాజల్.. ఇంకోసారి ఇలా చేయకు అని లోబోకు సీరియస్ వార్నింగ్ ఇవ్వాల్సిందని ఆగ్రహించింది. పక్కనే ఉన్న సిరి.. ఈ విషయాన్ని రవికి చెప్తా అనడంతో పింకీ వదిలేయండి అని చెప్పింది. అప్పుడే అక్కడికి వచ్చిన లోబో ప్రియాంకక్ హగ్ ఇచ్చి వెళ్లాడు. ఇంటిలో ఆడవాళ్ళు మగవాళ్ళు అనే జండర్ గురించి ప్రస్తావన వచ్చిన సమయంలో… ప్రియాంక సింగ్ ఈ కామెంట్లు చేయడం జరిగింది.