Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో మానస్ చాలా సైలెంట్ గా తన గేమ్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హౌస్ లో ఫస్ట్ లవ్ స్టోరీ కంటెస్టెంట్ లు చెప్పాలన్న టైంలో..మానస్.. చిన్ననాటి టైం లో ఒక అమ్మాయిని లవ్ చేసినట్లు అప్పట్లో తను రౌడీగా.. చాలా రూడ్ గా ప్రవర్తించినట్లు తెలపడం జరిగింది. దీంతో సైలెంట్ అనుకున్నా మానస్ లో.. మరో కోణం కూడా ఉందని ప్రేక్షకులు లవ్ స్టోరీ విన్నాక.. బయట డిస్కషన్లు చేసుకుంటూ ఉన్నారు. కాగా శుక్రవారం ఎపిసోడ్ లో… హౌస్ లో బెస్ట్ అండ్ వరస్ట్ పెర్ఫార్మర్ ఎవరు అనేదాన్ని విషయంలో ఇంటి సభ్యులు ఎంచుకోవాలని…బిగ్ బాస్..టాస్క్ ఇవ్వటం జరిగింది.
ఈ క్రమంలో కెప్టెన్ జెస్సీ.. హమీదాను; షణ్ముఖ్, హమీదా, సిరి, కాజల్, రవి, నటరాజ్ మాస్టర్, శ్రీరామచంద్ర.. మానస్‌ను; విశ్వ, లహరి.. ప్రియను; యానీ మాస్టర్.. సన్నీని; శ్వేత వర్మ.. నటరాజ్ మాస్టర్, సన్నీ.. షణ్ముఖ్లనను వరస్ట్ పర్ఫామర్లుగా సూచించారు. మానస్.. తనకు తానే నచ్చలేదంటూ తన పేరు చెప్పుకున్నాడు. అది కుదరదని కెప్టెన్ వారించడంతో మానస్.. జెస్సీ పేరును సూచించాడు. మొత్తం మీద ఎక్కువ ఓట్లు మానస్ కి.. రావటంతో అతడిని జైల్లో వేయడం జరిగింది.
ఇదిలా ఉంటే జైల్లో ఉన్న మానస్ కి… హమీదా అన్నం తినిపిస్తూ ఉండటంతో ప్రియాంక సింగ్ కి.. నచ్చక పోవటంతో వెంటనే..మానస్ పై.. సీరియస్ అవుద్ది. ఈ క్రమంలో ఆమె తనకు మంచి ఫ్రెండ్ అని సిస్టర్ లాంటిదని..మానస్ ప్రియాంక సింగ్ కి.. తెలియజేయడంతో.. వెంటనే సంతోష పడ్డ పింకీ.. హౌస్ లో అవసరమైతే శ్రీరామ్‌కు అయినా రాఖీ కడతా కానీ నీకు మాత్రం కట్టనని మానస్‌కు ఊహించని షాక్ ఇస్తది. మానస్… హమీద కి… గోరు ముద్దలు తినిపించడం పట్ల.. ప్రియాంక సింగ్ జలసీ గా ఫీల్ అయ్యి..ఈ కామెంట్లు చేయడం జరిగింది.