ప్రస్తుతం ఈ సమాజంలో కొన్ని విషయాలను నమ్మడానికి ఇష్టపడరు. కానీ ఆ విషయాల వెనుక ఎన్నో రహస్యాలు ఉన్నాయని అంటున్నారు. అయితే ఇంటి విషయంలో భారతీయులు వాస్తు శాస్త్రం ఎలా పాటిస్తారో ఆఫీస్ విషయంలో కూడా కొన్ని విషయాలు పాటించాలి. ఆఫీస్ లో అయినా మనం కూర్చున్న చోట వాస్తు దిశ ఉందో లేదో చూసుకోవాలి. అవి పట్టించుకోకపోతే కొన్ని కష్టాలు కూడా ఎదురవుతాయి. కాబట్టి ఇంటి విషయంలోనే కాకుండా ఆఫీస్ లో కూడా వాస్తు పట్టించుకోవాలి.
ముందుగా మీరు పని చేసే ఆఫీస్ లో ఏ దిశలో కూర్చుంటున్నారో చూసుకోవాలి. అంతేకాకుండా మీ చుట్టూ ఉన్న పరిసరాలను కూడా ఒకసారి గమనించుకుంటే మంచిది. మీ ముందు కూర్చునే వారి దిశలు కూడా మీరు చూసుకొని మార్చుకోవాలి. వాస్తు శాస్త్రం ప్రకారం మీరు మీ ఆఫీసులో తూర్పు లేదా ఉత్తరం ముఖం చేసి కూర్చుంటే మంచిది. అంతేకాదు మీరు కూర్చున్న చోట మీపై భాగాన కిటికీలు, తలుపులు వంటివి ఉండకూడదు. అలా ఉంటే ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఎదురవుతాయి.
మీరు కూర్చున్న ఆవరణ ముందు వీధికి ఎదురుగా ఉండకుండా చూసుకోవాలి లేకుంటే మీరు చేసే పనుల ఫలితాలు అందవు. అంతేకాదు ఇంట్లో కూర్చునేటప్పుడు అయినా గుమ్మానికి ఎదురుగా కూర్చోవద్దు. దానివల్ల శాంతి లేకుండా పోతుంది. మీరు ఉత్తరం లేదా తూర్పు ముఖాన కూర్చున్నట్లయితే మీరు ఉద్యోగంలో ప్రశంసలు అందుకుంటారు, ఆర్థికంగా లాభాలు కూడా ఉంటాయి.
అంతేకాకుండా వాస్తు పాటిస్తే ప్రమోషన్ లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మీరు కూర్చునే వెనక బ్యాక్ రెస్ట్ ఉండకూడదు. అలా ఉంటే ఇబ్బందులు ఎదురవుతాయి. మీ ఆఫీస్ బేస్మెంట్ దక్షిణ, నైరుతి, వాయువ్యం, పడమర దిశలో ఉండకూడదు. అలా ఉంటే మంచి జరగదు. ఇలాంటివి నమ్మడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా కొన్ని నమ్మాలి. అప్పుడే ఆఫీస్ లో నైనా, మీ ఇంటి దగ్గరైన వాస్తు దిశలు చూసుకొని జాగ్రత్త పడాలి.