Subscribe for notification

Prophet Row: నుపుర్ శర్మ భవిష్యత్తులో ఢిల్లీ సీఎం అభ్యర్ధి అవుతారేమో అంటూ అసదుద్దీన్ సెటైర్

Share

Prophet Row: మహమ్మద్ ప్రవక్త పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బీజేపీ నుండి సస్పెండ్ అయిన నువూర్ శర్మ పై ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. నూపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారాన్ని రేపాయి. ఇప్పటికీ ఆ వేడి చల్లారలేదు. నుపూర్ శర్మ పై పలు పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదు అయ్యాయి. ఆమెను అరెస్టు చేసి తగిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పై పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. బీజేపీ మాత్రం నుపూర్ శర్మతో పాటు ఆమె వ్యాఖ్యలను సమర్ధించిన నవీన్ జిందాల్ లను పార్టీ నుండి సస్పెండ్ చేసింది.

Prophet Row Asaduddin Owaisi key comments on nupur Sharma

 

గత కొద్ది రోజులుగా ఆమెను సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ తాజాగా ఆమెపై సెటైర్ లు వేశారు. నుపూర్ శర్మ భవిష్యత్తులో బడా రాజకీయ నేతగా ఎదుగుతారనీ, ఢిల్లీకి ముఖ్యమంత్రి పదవికి పోటీ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. నువూర్ శర్మను అరెస్టు చేసి చట్టప్రకారం శిక్షించాలని మరో సారి డిమాండ్ చేసిన అసదుద్దీన్ ఓవైసీ.. బీజేపీ ఆమెకు అండగా నిలుస్తొందని విమర్శించారు. దీనిపై ప్రధాని మోడీ నోరు మెదపడం లేదని అన్నారు. రాష్ట్రం నుండి పోలీసులను ఢిల్లీకి పంపి ఆమెను అరెస్టు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కు విజ్ఞప్తి చేశారు అసదుద్దీన్.

 

ఇదే సందర్భంగా యూపీలో యూక్టివిస్ట్ ఫాతిమా ఇల్లు కూల్చివేతపైనా మండిపడ్డారు అసదుద్దీన్. ఆమె ఇంటిని ఎందుకు కూల్చివేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఫాతిమా తండ్రి అల్లర్లు సృష్టించాడని బీజేపీ ఆరోపిస్తోందనీ, ఆ ఆరోపణలు నిజమా కాదా తేలకముందే ఇంత కఠినంగా ఎలా వ్యవహరిస్తారని ప్రశ్నించారు అసదుద్దీన్. ఆయన అల్లర్లు సృష్టించాడా లేదా అన్నది విచారణ చేసిన తరువాత తేలుతుందనీ, కోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవాల్సింది పోయి ఇష్టానుసారంగా ఇల్లు కూల్చివేయడం ఏమిటని అసదుద్దీన్ మండిపడ్డారు.


Share
somaraju sharma

Recent Posts

Today Horoscope: జూలై 5 – ఆషాడమాసం – రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…

33 mins ago

Samantha Tapsee: సమంత సినిమా పై క్లారిటీ ఇచ్చిన తాప్సి..!!

Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…

3 hours ago

God Father: చిరంజీవి “గాడ్ ఫాదర్” లుక్ అదరగొట్టేసింది.. ఫ్యాన్స్ నుండి పాజిటివ్ టాక్..!!

God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…

4 hours ago

Ram Pothineni Boyapati: రామ్ పోతినేని మూవీకి కూడా బాలకృష్ణ హిట్ ఫార్ములా వాడుతున్న బోయపాటి..??

Ram Pothineni Boyapati: బోయపాటి(Boyapati Srinivas) దర్శకత్వంలో రామ్ పోతినేని(Ram Pothineni) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ కెరియర్…

6 hours ago

Upasana: పిల్లల విషయంలో రామ్ చరణ్ భార్య వేసిన ప్రశ్నకు సద్గురు సంచలన సమాధానం..!!

Upasana: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు(Sadguru) ప్రపంచవ్యాప్తంగా సేవ్ సాయిల్ పేరిట పర్యటనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో…

6 hours ago

Bimbisara: ‘బింబిసార’ తాత గారికి అంకితం కళ్యాణ్ రామ్ సంచలన కామెంట్స్..!!

Bimbisara: నందమూరి హీరో కళ్యాణ్ రామ్(Kalyan Ram) 'బింబిసార'(Bimbisara) ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. 'బింబిసార' సినిమా…

6 hours ago