Subscribe for notification

Devi Nagavalli: రెచ్చగొట్టింది.. రచ్చ చేసింది… దేవి నాగవల్లే ! విశ్వక్సేన్ వివాదంలో యాంకర్ నే తప్పుబడుతున్న నెటిజన్లు!

Share

Devi Nagavalli: వర్ధమాన హీరో విశ్వక్ సేన్,టీవీ నైన్ సీనియర్ యాంకర్ దేవి నాగవల్లి మధ్య తలెత్తిన వివాదం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.సోషల్ మీడియాలో ఇదే చర్చనీయాంశమైంది.అదే సమయంలో వీరిద్దరిలో ఎవరిది తప్పు అన్న విషయమై ఓటింగ్ కూడా జరుగుతోంది.అయితే అధిక శాతం మంది దేవి నాగవల్లిని తప్పుబడుతుండటం ఇక్కడ విశేషం.ఆమె రెచ్చగొట్టే ధోరణి వల్లే విషయం ఇంతవరకు వచ్చిందని ఎనభై శాతం మంది అభిప్రాయపడుతున్నారు.

provoked … Devi Nagavalle! Netizens mistaken for anchor in Vishwaksen controversy

Devi Nagavalli: అసలేం జరిగిందంటే!

విశ్వక్ సేన్ తన తాజా చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ లో భాగంగా ఒక ప్రాంక్ వీడియో తీశారు.అయితే అదేదో పెద్ద నేరం అన్నట్లు ఒక న్యాయవాది మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు.ఈ విషయం తెలియగానే టీవీ నైన్ యథాప్రకారం ఆ అంశంపై చర్చ చేపట్టింది. ఆ చర్చలో తననే టార్గెట్ చేశారన్న విషయం తెలుసుకొని విశ్వక్సేన్ నేరుగా టీవీనైన్ స్టూడియోకు వచ్చి డిబేట్లో జాయిన్ అయ్యారు .తనను రంజిత్ అనే వ్యక్తి ఫోన్ చేసి పిలవడంతో డిబేట్ కు వచ్చినట్లు విశ్వక్సేన్ వివరణ ఇచ్చాడు.ఇష్టం లేకపోయినా దేవి నాగవల్లి ఆ హీరోను చర్చకు అనుమతించింది. తదుపరి వివాదం ముదిరి విష్వక్సేను ను దేవి నాగవల్లి గెటౌట్ ఫ్రమ్ స్టూడియో అని అరిచింది.దీనికి ఆ హీరో కూడా బూతు సమాధానం ఇచ్చి వెళ్లిపోయాడు.అప్పటినుండి విష్వక్సేను యేదో విలన్ అన్నట్లు టీవీ నైన్ విపరీతమైన విష ప్రచారం ప్రారంభించింది.

provoked … Devi Nagavalle! Netizens mistaken for anchor in Vishwaksen controversy

ఆది నుండి సెటైర్లే!

అయితే దేవి నాగవల్లి చర్చ మొదలైనప్పట్నుండి ఆ హీరోను కార్నర్ చేయాలని చూశారు.విశ్వక్ సేన్ ను అందరూ పాగల్ సేన్ అంటారని ఆమె తరుచూ వ్యాఖ్యానించడం జరిగింది.అంటే అతడో పిచ్చివాడన్న అర్థంలో ఆమె మాట్లాడిందని అర్థం అవుతూనే ఉంది.విశ్వక్ సేన్ తన వివరణ ఇచ్చుకునే అవకాశం లేకుండా దేవి నాగవల్లి అతడు ప్రాంక్ వీడియో చేయడం తప్పని చెప్పించే గట్టిగా చేసింది.ఈ క్రమంలో యాంకర్ దేవి కూడా తన పరిధులు దాటి జర్నలిజం విలువలను మంట గలిపింది.

provoked … Devi Nagavalle! Netizens mistaken for anchor in Vishwaksen controversy

వేళ్లన్నీ దేవి నాగవల్లి వైపే!

ఈ ఉదంతంపై సీనియర్ జర్నలిస్టులు మొదలుకొని సోషల్ మీడియా యాక్టివిస్టులు సైతం లోతుగా విశ్లేషణ చేసి దేవి నాగవల్లి వైఖరి కారణంగానే ఈ రచ్చ జరిగిందని తేల్చేశారు.యాంకర్ దేవి నాగవల్లి హీరో విశ్వక్ సేన్ ను పిచ్చివాడని మాట్లాడటం,గెటవుట్ అనడం ఏమాత్రం సమర్థనీయం కాదన్నారు.ఆమె ప్రవర్తన కారణంగా అవమానానికి గురైన విశ్వక్సేన్ ఆ తదుపరి సహనం కోల్పోయిన మాట వాస్తవమేనని,అది కూడా తప్పేనన్నారు.కానీ దేవి నాగవల్లి సంయమనంతో వ్యవహరించి ఉంటే అసలు ఈ వివాదం ఇంత వరకూ వచ్చేది కాదన్నది విశ్లేషకుల ఏకాభిప్రాయం!


Share
Yandamuri

Recent Posts

Rana: ఆ బాలీవుడ్ స్టార్ హీరో సినిమా నుండి బయటకొచ్చేసిన రానా..??

Rana: దగ్గుబాటి రానా(Rana) హీరోగా మాత్రమే కాదు అన్ని రకాల పాత్రలు చేస్తూ తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం…

3 mins ago

Prabhas: ప్ర‌భాస్ ఆ డైరెక్ట‌ర్ కు హ్యాండ్ ఇవ్వ‌డం ఖాయ‌మేనా?

Prabhas: పాన్ ఇండియా స్టార్‌గా స‌త్తా చాటుతున్న టాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ ప్ర‌భాస్ వ‌రుస భారీ చిత్రాలతో ఎంత బిజీగా…

40 mins ago

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ బీజేపీ నుండి దూరం అవుతున్నట్లే(నా)..! ఈ ప్రసంగంలో భావం అలానే ఉందిగా..!?

Pawan Kalyan: రాష్ట్రంలో బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. జనసేనతోనే మా పొత్తు ఇంక ఏ పార్టీతోనూ మాకు పొత్తు లేదు…

1 hour ago

Shriya Saran: ఎంత భ‌ర్తైతే మాత్రం రోడ్డుపై అత‌డితో అంత రెచ్చిపోవాలా శ్రియా..?

  Shriya Saran: అందాల భామ శ్రియ‌ సరన్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఇష్టం` మూవీతో సినీ కెరీర్‌ను…

2 hours ago

CM YS Jagan: కుమార్తె హర్ష ప్రతిభకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సీఎం వైఎస్ జగన్ ట్వీట్

CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన కుమార్తె హర్ష…

2 hours ago

Vijay Deverakonda: విజ‌య్ న‌గ్న ఫొటోను వ‌ద‌ల‌డం వెన‌క అస‌లు కార‌ణం ఏంటో తెలుసా?

Vijay Deverakonda: టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ తొలి పాన్ ఇండియా చిత్రం `లైగ‌ర్‌`. డాషింగ్ అండ్ డైన‌మిక్…

3 hours ago