పునర్నవి.. ఒకప్పుడు ఈమె సైడ్ యాక్టర్. పెద్దగా గుర్తింపు కూడా లేదు. అలాంటి పునర్నవి బిగ్ బాస్ కి వెళ్ళింది. అంతే స్టార్ అయిపొయింది. బిగ్ బాస్ తో అంత స్టార్ డమ్ సంపాదించిన సరే పునర్నవి బిగ్ బాస్ వెళ్ళకుంటేనే మంచిది అంటూ ఇటీవల ఓ ప్లా కార్డుకు పోజు ఇచ్చి ఆశ్చర్యపరిచింది. ఇది అంత పక్కన పెడితే ఆమె సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది.
బిగ్ బాస్ కి వెళ్లి వచ్చిన తర్వాత ఆమె మరింత యాక్టీవ్ గా ఉంటుంది. ఇక ఇంస్టాగ్రామ్ లో ఆమె హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ అందరిని ఆకట్టుకుంది. అలాంటి ఈ అందగత్తెకు బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఫైర్ బ్రాండ్ అనే పేరు కూడా వచ్చింది. ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరోసారి ఆమె ఫైర్ బ్రాండ్ అని నిరూపించుకుంది.
అసలు ఎం జరిగిందంటే.. తాజాగా పునర్నవి నెటిజన్లతో చిట్ చాట్ చేసింది. ఆమెకు బోర్ కొడుతుందని ఎవరైనా ప్రశ్నలు అడగండి.. సమాధానం చెప్తా అంటూ ఇంస్టాగ్రామ్ లో చెప్పుకొచ్చింది. దీంతో ఎవరికి నచ్చింది వాళ్ళు అడిగేశారు.. ఇంకా అలానే ఓ నెటిజన్ ఆమెను వాట్సాప్ నెంబర్ అడగగా.. అతడికి గట్టి కౌంటర్ ఇచ్చింది. శివమణి సినిమాలోని నాగార్జున డైలాగ్ ఫోన్ నెంబర్ వీడియోను షేర్ చెయ్యగా అది ప్రస్తుతం వైరల్ గా మారింది.