Pushpa: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప..!! ఎర్రచందనం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది.. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన మూడు పాటలు విశేష ఆదరణ పొందాయి.. తాజాగా ఈ చిత్రం లోని 4వ పాట ‘ఏ బిడ్డా ఇది నా అడ్డా’ ను ఈనెల 19న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు..!!
ఏ బిడ్డా ఇది నా అడ్డా పాటను నవంబర్ 19న విడుదల చేయనున్నట్లు తెలుపుతూ బన్నీ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సరికొత్త పోస్టర్ లో బన్నీ మాస్ లుక్ లో కనిపించారు.. త్వరలోనే ఈ చిత్రం నుంచి ట్రైలర్, ఐదో పాట అప్డేట్లు ఇవ్వనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించారు. అల్లు అర్జున్ న్యూ లుక్ తో పాటు పుష్ప చిత్రం నుంచి వరుస అప్డేట్ లో రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి లో ఉన్నారు.
ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మిక మందన నటిస్తోంది. మలయాళీ నటుడు ఫహద్ ఫజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది.