క‌లెక్ట‌ర్ కావాల‌నుకుని యాక్ట‌ర్ గా మారిని హీరోయిన్ ఎవ‌రో తెలుసా..?

చిన్న‌ప్ప‌టి నుంచి చాలామందికి డాక్ట‌ర్ కావాల‌ని కోరిక ఉంటుంది. అందులో కొంద‌రు యాక్ట‌ర్లుగా మారిపోయిన వారుకూడా ఉన్నారు. ఈ విష‌యాల‌ను ప‌లువురు సినీ యాక్ట‌ర్లు స్వ‌యంగా చెప్పుకుంటారు. ఒక‌టి అనుకుంటే ఇంకోటి అవ్వ‌డం అంటే ఇదే అని చెప్పుకొస్తారు. అయితే ఒక ముద్దుగుమ్మ మాత్రం త‌ను చిన్న‌ప్పుడు గాయ‌ని కావాల‌నుకుంది. కొంచెం పెరిగి పెద్ద‌య్యక పుస్త‌కాల పురుగ్గా మారిపోయింది. దాంతో గాయ‌ని కాస్తా.. కలెక్ట‌ర్ కావాల‌ని క‌ల‌లుకంది.

కానీ విధి త‌న‌ని యాక్ట‌ర్ చేసింది. తొలి చిత్రం ఊహలు గుసగుసలాడే తో కుర్రకారును ఒక ఊపు ఊపింది. క‌ల‌ల ‌రాకుమా‌రిలా మారి కుర్ర‌కారును ఆగం చేసింది. త‌నే అందాల ముద్దుగుమ్మ రాశీ ఖన్నా. సోమవారంనాడు ఈ అందాల ముద్దుగుమ్మ పుట్టిన రోజు. ఈ రాకుమారి గురించి ప‌లు విష‌యాలు చాలా మందికి తెలియ‌వు. అయితే రాశీ ఖ‌న్నా.. ఢిల్లీలో పుట్టి పెరిగింది.

అక్క‌డే త‌న చ‌దువు పూర్తి చేసింది. త‌ను చిన్న‌ప్పుడు సింగ‌ర్ కావాల‌నుకునేది అంటా.. కానీ పెరుగుతున్న కొద్ది చ‌దువుపై ఆస‌క్తి పెరిగి ఐఏఎస్ ఆఫీస‌ర్ కావాల‌నుకుంది. అలా త‌ను చ‌దువు అయిపోగానే ప్ర‌క‌ట‌న‌ల‌కు కాపీ రైట‌ర్ గా ప‌ని చేసింది. ఆ త‌ర్వాత రాశీకి ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టించే అవ‌కాశం వ‌చ్చింది. అది ఆమెను పూర్తిగా మార్చేసింది.

ప్ర‌క‌ట‌న‌ల గుర్తింపుతో రాశీకి 2013లో హిందీ సినిమా మాద్రాస్ కేఫ్ లో అవ‌కాశం వ‌చ్చింది. ఈ సినిమా రూ. 100 కోట్ల మార్క్ ను దాట‌డంతో ఆమెకు క‌లిసి వ‌చ్చింది. ఈ సినిమాను చూసి ఊహ‌లు గుసగుసలాడే లో త‌న‌ని హీరోయిన్ గా పెట్టారు. అది కూడా త‌న‌కు మంచి మార్కులు తెచ్చిపెట్టింది. ఇలా స్టార్ట్ అయిన త‌న కెరీర్.. దూసుకుపోయింది. వరుస సినిమాలతో బిజీగా ఉండేలా చేసింది. జోరు, జిల్, శివమ్, బెంగాల్‌ టైగర్ ఇలా ప‌లు చిత్రాల్లో న‌టిస్తూ విజ‌యాల‌ను సొంతం చేసుకుంది.

అయితే రాశీ 2018 కోలీవుడ్‌కు పరిచయం అయ్యింది. అక్కడ కూడా వరుస సినిమాలతో విజ‌యం సాధించింది. వెంకీ మామ, ప్రతిరోజూ పండగే సినిమాలు మ‌రింత పేరు తెచ్చిపెట్టాయి త‌న‌కు. ఇప్పుడు రాశీ చేతిలో నాలుగు కోలీవుడ్ సినిమాలు ఉన్నాయ‌ని స‌మాచారం.అయితే రాశీ సినిమాల్లోకి రావడానికి ముందు మోడలింగ్‌, యాక్టింగ్‌పై ఏ మాత్రం ఆసక్తి ఉండేది కాదంటా..త‌ను చ‌దువుకునే రోజుల్లో ప్రేమ‌లో ప‌డిందంటా.. కానీ అది విఫ‌ల‌మైంద‌ట‌. ఇలాంటి ప‌లు విష‌యాల‌ను ఆమె ఒక ఇంట‌ర్వ్యూలో పేర్కొంది.