Raja Raja Chora: యంగ్ హీరో శ్రీ విష్ణు, మేఘ ఆకాష్, సునయన హీరోయిన్లుగా నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ రాజ రాజ చోర.. ఇటీవల ‘చోర గాథా’ పేరుతో బిగ్ బాస్ ఫేమ్ గంగవ్వ వాయిస్ ఓవర్ తో విడుదల చేసిన ఈ వీడియోకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.. తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు మేకర్స్..!!

Read More: Pushpaka Vimanam: పుష్పక విమానం లోని కళ్యాణం లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసిన సమంత..
హీరో ఒక మురికివాడ లో నివాసం ఉంటూ చేస్తూ ఉంటాడు.. మరోవైపు సాఫ్ట్వేర్ అని చెప్పుకు తిరిగే క్యారెక్టర్ లో శ్రీవిష్ణు ఒదిగిపోయాడు. శ్రీ విష్ణు పట్టుకునే పోలీసు పాత్రలో రవిబాబు కనిపించారు. ఈ చిత్రంలో ఒక పాత్రలో మై విలేజ్ షో గంగవ్వ కూడా నటించింది. తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, కాదంబరి కిరణ్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు నటిస్తున్న ఈ టీజర్ అందరిని ఆకట్టుకుంటుంది. ఈచిత్రానికి వివేక్ సాగర్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రానికి హాసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్నారు.. ఈ టీజర్ ఆకట్టుకోవడంతో రాజ రాజ చోర సినిమాపై అంచనాలను పెంచేసింది..