టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. గత నెల కుటుంబ సభ్యుల మధ్య గుట్టుగా నిశ్చితార్థం జరుపుకున్న కాజల్ అగర్వాల్ అక్టోబర్ 30వ తేదీన ముంబైలో పెళ్లి చేసుకోనున్నట్టు ఇంస్టాగ్రామ్ లో తెలిపింది. ఈ విషయాన్నీ ఆమె ఈరోజు ఇంస్టాగ్రామ్ లో వెల్లడించింది.
లాక్ డౌన్ సమయంలో రానా దగ్గుబాటి, నిఖిల్, నితిన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు గార్ల వివాహం ఎటువంటి హంగు ఆర్బాటం లేకుండా కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. ఇక అలానే కాజల్ అగర్వాల్ కూడా కేవలం కుటుంబసభ్యుల మధ్య పెళ్లి చేసుకోనున్నట్టు ఆమె తెలిపింది. అయితే కాజల్ పెళ్ళికి ఓ ముఖ్య అతిథి వెళ్లనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయ్.
ఎవరు అబ్బా ఆ అనుకోని అతిథి అని అనుకుంటున్నారా? అతనే అండి.. దర్శకదీరుడు జక్కన్న రాజమౌళి. కాజల్ పెళ్లి కి రాజమౌళి వెళ్తున్నాడా? అంత పరిచయం వీరికి ఎక్కడిది అని మీకు సందేహం రావచ్చు. కానీ రాజమౌళికి, కాజల్ కి మధ్య మంచి స్నేహం ఉంది. ఈ స్నేహం ఇప్పుడుది కాదు.
మగధీర సమయంలోది. అప్పట్లో మగధీరలో మిత్రవిందగా నటించి అందరిని మెప్పించిన ఈ భామకు రాజమౌళి, అతని కుటుంబ సభ్యులతో మంచి స్నేహానుబంధం ఉంది. ఇక ఆ స్నేహం వల్లే దర్శకదీరుడు రాజమౌళి కాజల్ అగర్వాల్ పెళ్లికి వెళ్లనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయ్. ఈ వార్తల్లో ఎంత నిజం ఉందనేది తెలియదు కానీ సోషల్ మీడియాలో ఈ వార్త తెగ హల్ చల్ చేస్తుంది.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!