ఈటీవీలో వారానికి రెండు రోజులు వచ్చే అతి పాపులర్ రియాల్టీ షో ‘జబర్దస్త్’ లో టీం లీడర్లు అలాగే మిగిలిన సభ్యులు వేసే పంచ్ లకు, సెటైర్లకు ప్రేక్షకులు పొట్టలు చెక్కలయ్యేలా నవ్వుకుంటారు. అప్పుడప్పుడు బయట జరిగే విషయాల పై కూడా వీరు ఫన్నీ స్కిట్ లు రూపొందించి ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. గత కొద్ది నెలలుగా యూట్యూబ్ లో ప్రముఖ డాన్స్ మాస్టర్ రాకేష్ ప్రవర్తనపై ఎన్నో వీడియోలు వచ్చాయి. అతనిని ఇంటర్వ్యూ చేస్తూ అనేకానేక వీడియో లు వచ్చాయి.
రాకేష్ మాస్టర్ కూడా ఎప్పుడూ మద్యం తాగుతూ యూట్యూబ్ లో ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు. శేఖర్ మాస్టర్ ను అతను ఎప్పుడూ తిడుతూ ఉంటాడు. రాకేష్ మాస్టర్ ఇండస్ట్రీ ప్రముఖులను తిట్టేందుకు కూడా వెనకాడరు. రాకేష్ మాస్టర్ తన జీవితం గురించి ఒక చిత్రం తీస్తాను అంటూ పుల్లయ్య అనే కర్నూల్ పిల్లవాడిని దగ్గరకు చేర్చుకుని అతనికి డాన్స్ మూమెంట్స్ నేర్పిస్తూ వీడియోలు రిలీజ్ చేశాడు. అవి కూడా బాగా వైరల్ అయ్యాయి కానీ అంతా అతనిని ట్రోల్ చేసేవారే. అయితే ఏమైందో ఏమో కానీ ఒక్కసారి పుల్లయ్యగా రాకేష్ మాస్టర్ నుండి బయటకు వచ్చేసి ఇంటర్వ్యూల్లో మాస్టర్ ని తినడం మొదలెట్టాడు.
తాగేసి ఎప్పుడూ.. ఇష్టం వచ్చినట్లు తిడతాడని…. ఇక భరించలేక అతని నుండి వచ్చేసాను అని అన్నాడు. గట్టిగా మాట్లాడితే రాకేష్ కు డాన్స్ కూడా రాదు అని చెప్పడం గమనార్హం. రాకేష్ మాస్టర్ కోపిష్టి. అది అతని ఇంటర్వ్యూ చూస్తే ఎవరికైనా తెలిసిందే. అలాంటి రాకేష్ మాస్టర్ పాత్రను జబర్దస్త్ లోని బుల్లెట్ భాస్కర్ టీం లో ఉండే నరేష్ వచ్చేవారం స్కిట్ లో పోషించనున్నాడు. అతనిలాగే పిలక పెట్టుకొని నరేష్ ….రాకేష్ మాస్టర్ డైలాగులను అచ్చం అతనిలాగే మాట్లాడుతూ ఫన్ క్రియేట్ చేశాడు. అలాగే నిజంగానే రాకేష్ మాస్టర్ శిష్యుడు పుల్లయ్య జబర్దస్త్ లో అడుగుపెట్టడంతో ఒక్కసారిగా రోజా, రేష్మి ఆశ్చర్యపోయారు. ఇక వచ్చే వారం జబర్దస్త్ ప్రోమో అంతా వీరి హవా నే నడిచింది. ప్రేక్షకులు కూడా ఈస్ స్కిట్ కోసం భారీగా వెయిట్ చేస్తున్నారు.