Ram Charan: రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు రావడంతో సినీ ప్రేక్షకులంతా సంబరాలు చేసుకుంటున్నారు. దేశం గర్వించేలా చేసిన రాజమౌళి యూనిట్ మొత్తానికి అభినందనలు చెబుతూ హోరెత్తిస్తున్నారు.. ఈ ఈవెంట్ కి రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి వచ్చారు. తాజాగా పుట్టబోయే బిడ్డ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు రామ్ చరణ్.

ఉపాసన మాట్లాడుతూ.. రామ్ ని ఎప్పుడు సపోర్ట్ చేస్తానని.. ఆర్ఆర్ఆర్ ఫ్యామిలీలో భాగం అయ్యేందుకు ఇక్కడికి వచ్చాను. ఆస్కార్ రావడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. ఇక రామ్ చరణ్ మాట్లాడుతూ అభిమానులకు ఉపాసన ప్రెగ్నెన్సీ పై గురించి క్లారిటీ ఇచ్చారు. ఉపాసన ఇప్పుడు ఆరో నెల గర్భవతి.. మాకు పుట్టబోయే బిడ్డ ముందుగానే ఎంతో అదృష్టం తో పాటు తనకి ఇంతమంది ప్రేమను లభిస్తుందని అన్నారు.
గుడ్ మార్నింగ్ అమెరికా షోలో పాల్గొన్న రామ్ చరణ్ తన వ్యక్తిగత విషయాలు పంచుకున్నారు. అమెరికాలోని ప్రముఖ గైనకాలజిస్ట్ జెన్నీఫర్ ఆస్టన్ ఉపాసనకి డెలివరీ చేయనున్నారని తెలిపారు.అమెరికా వెళ్లడానికి కొద్ది రోజులు ముందే ఉపాసన స్నేహితులందరూ కలిసి ఆమెకు సీమంతం కూడా చేశారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ సంగతి తెలిసిందే.