RGV Pawan Kalyan: ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇటీవల కొండ సురేఖ మరియు మురళి జీవిత కథ ఆధారంగా “కొండా” అనే బయోపిక్ తెరకెక్కించడం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న రాంగోపాల్ వర్మ ఓ ప్రైవేటు యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గురించి యాంకర్ పలు ప్రశ్నలు వేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సాధారణ వ్యక్తి పై పోలీసులు చేసుకుంటే ఎంపీ అయ్యాడు. అయితే ఒక ఎంపీ పై పోలీసులు చేసుకుంటే ఏమవుతాడు అనే కాన్సెప్ట్ పై సినిమా ఏమైనా చేస్తారా అని ఆర్జివి ని ప్రశ్నించారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
దానికి నాకు అర్థం కాలేదు అని ఆర్జివి.. అంటే వెంటనే ఆ సాధారణ వ్యక్తి బాపట్ల ఎంపీ నందిగామ సురేష్. ఇంకా ఎంపీ విషయానికి వస్తే రఘురామకృష్ణరాజు. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు తనని పోలీసులు చిత్రవధ గురి చేశారని.. చాలా సందర్భాలలో చెప్పుకుంటున్నారు. ఈ కాన్సెప్ట్ పై మీరేమైనా కొండ తరహాలో సినిమా చేయాలని భావిస్తున్నారా..? దానికి ఆర్జీవి ఇచ్చిన సమాధానం.. వాళ్లు చేసిన దాన్ని బట్టి పోలీసులు రియాక్షన్ ఉంటది. అయినా అంత కంటెంట్ కలిగిన స్టోరీ ఏమి కాదు అది.
ఆ ఇన్సిడెంట్ ఇంకా ఎండ్ పాయింట్ కి వెళ్ళాక ఏమైనా ట్రై చేయొచ్చు అని తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా..? అని యాంకర్ ప్రశ్న వేశాడు. దానికి రామ్ గోపాల్ వర్మ సమాధానం ఇస్తూ.. అసలు నేను పవన్ కళ్యాణ్ నీ ఈమధ్య ఫాలో అవ్వటం లేదు. పొలిటికల్ ఈక్వేషన్స్, ఇంకా వాళ్ళు చేసే ఆలోచనల గురించి అస్సలు ఐడియా లేదు అంటూ తనదైన శైలిలో ఆర్జీవి సమాధానమిచ్చారు.