ఎనర్జిటిక్ హీరో రామ్ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండే తన నటన అంటే ఇష్ట పడని వారెవరూ ఉండరేమో.. ఎప్పుడూ చూసినా స్మైలింగ్ ఫేస్ తో అమ్మాయి మనసులో చోటు దక్కించుకుని అమ్మాయిల కలల రాకుమారుడిగా స్థానం సంపాదించుకున్నాడు ఈ యంగ్ హీరో.. తన స్టైల్ తో ఎప్పుడూ యూత్ కు ట్రెండ్ గా మారాతాడు. అయితే సినిమాల్లో తన నటన ద్వారా ఎంత మంచి పేరు సంపాదించుకున్నాడో ఈ హీరో బయటకూడా అంతే పేరు సంపాదించుకున్నారు.
ఇదిలా ఉంటే స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ను కేరళ ప్రభుత్వం ప్రత్యేకంగా జరుపుకునే పండగకు ప్రతి ఏడాది ఆహ్వానిస్తుందన్న విషయం తెలిసిందే. కేరళలో అల్లుకి చాలా మంది ఫ్యాన్సే ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే అకాల వర్షాల కారణంగా అతలాకుతలం అయిన కేరళను అల్లు తనకు తోచిన ఆర్థిక సాయం చేసి అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఇలాంటి గౌరవమే హీరో రామ్ కూడా దక్కించుకున్నారు. ఒక రాష్ట్ర ప్రభుత్వంతో అనుబంధం ఉన్న ప్రముఖ ఆర్గనైజేషన్ హీరో రామ్ ను పిలిచి సత్కరించడం అందరిలోనూ ఆసక్తిని పెంచుతుంది. ఇంతకి రామ్ పోతినేనిని ఎందుకు సత్కరించినట్టు అని అనుకుంటున్నారు కదూ.. అవును నిజమే ఆ ప్రఖ్యాత విద్యాసంస్థలో ఈ హీరో మాంచి గౌరవాన్ని అందుకున్నారు.
అది ఎక్కడంటే ఎంతో ప్రతిష్టాత్మక నేపాలీ క్రియేటివ్ యాన్యువల్ ప్రొగ్రాంకు రామ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. రామ్ నటనకు ఫ్యాన్స్ ఫాలోయింగే ఇందుకు కారణమని చెప్పుకోవచ్చు. నేపాల్ లో అతడికి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగే అతనికి ఆహ్వానం అందేలా చేసింది. అయితే రామ్ అక్కడకు ఎందుకు వెళ్లారన్న తాజా సమాచారం ప్రకారం.. రామ్ పోతినేని నేపాల్ వర్చువల్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అక్కడ ఎంతో ప్రతిష్టాత్మకంగా పేరు పొందిన హల్డ్ ప్రైజ్ అనేది వర్చువల్ యువత నేతృత్వంలోని ఒక యూనిట్. ఈ హల్డ్ ప్రైజ్ ను అక్కడి విద్యార్థులు నోబెల్ ప్రైజ్ గా భావిస్తారు.
అయితే ఇది అర్హత గల విద్యార్థులకు పెట్టుబడులను అందిస్తుంటుంది. అయితే ఈ కార్యక్రమం గ్రాండ్ ఫైనల్ ప్రొగ్రాంమ్ కు రామ్ అతిథిగా ఆహ్వానించబడ్డారు. అక్కడ రామ్ అతిథి మర్యాదలను ఘనంగా అందుకున్నారు. అయితే గతంలో ఈ ప్రొగ్రాంకు స్టీవ్ వోజ్నియాక్, అలీ జాఫర్ వంటి వారు ముఖ్య అతిథులుగా వచ్చేవారట. అయితే ఈ జాబితాలో రామ్ కూడా చేరిపోయాడని ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ ఈ అత్యున్నత కార్యక్రమానికి ఇండియా నుంచి వచ్చిన హీరోలో ఈయనే ముందున్నారట.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!