RamCharan Viral Video : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ మిన్నంటుతున్నాయి.. మార్చి 27న చరణ్ 36 వసంతంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ వారం ముందు నుంచే హంగామా చేస్తున్నారు..చరణ్ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం.. తమ అభిమాన హీరో ప్రత్యేక బహుమతులు పంపడం వంటివి చేస్తున్నారు.. తాజాగా మెగా ఫ్యాన్స్ కొందరు రామ్ చరణ్ ఇంటికి చేరుకుని ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు..
MegaPowerStar @AlwaysRamCharan about #RRRMovie and #Acharya #SIDDHA ? pic.twitter.com/AIw1M9dNrA
— Mega Power Sena™ (@MegaPowerSena) March 26, 2021
తనకు విషెస్ చేయడానికి వచ్చిన అభిమానులతో చెర్రీ సెల్ఫీ దిగడమే కాకుండా.. ఆర్ఆర్ఆర్ చిత్రం నుండి ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు సర్ప్రైజింగ్ పోస్టర్ విడుదల చేయనున్నట్లు.. నేను చూసాను.. మోషన్ పోస్టర్ చూసాను.. అదిరిపోయింది.. అలాగే రేపు చెర్రీ పుట్టినరోజు సందర్భంగా ఆచార్య మూవీ నుంచి న్యూ లుక్ పోస్టర్ ను విడుదల చేయనున్నట్లు చెర్రీ తెలిపాడు.. అలాగే 28 వ తేదీన వకీల్ సాబ్ సినిమా నుంచి పోస్టర్ ను విడుదల చేయనున్నట్లు రామ్ చరణ్ తెలిపారు..
MegaPowerStar @AlwaysRamCharan about #VakeelSaab @PawanKalyan ? pic.twitter.com/cqI9qT40V6
— Mega Power Sena™ (@MegaPowerSena) March 26, 2021
ఈ నెల నాకు మాత్రమే కాదు.. మన అందరికీ చాలా స్పెషల్ నెల.. నాది , నాన్నది, కళ్యాణ్ బాబాయి ది వరుసగా ఒకే నెలలో పోస్టర్లు చేయి రిలీజ్ చేయడం.. మళ్లీ ఇంకా ఎన్ని సంవత్సరాలకు ఇలా జరుగుతుందో కూడా నాకు తెలియదు.. అని చెర్రీ వివరించారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది..