Ramesh – Gopi: దర్శకులు రమేష్ – గోపి కలిసి రూపొందించిన ఇది నా లవ్ స్టోరీ సినిమా విజయం సాధించింది.. వీరిద్దరూ కలిసి తీసిన రెడ్డిగారి ఇంట్లో రౌడీయిజం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.. వీరిద్దరి కాంబినేషన్ లో కన్నడలో రూపొందించిన మరో సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.. తాజాగా వీరిద్దరి డైరెక్షన్ లో నాలుగవ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు.. ఈ సినిమాలో శోభన్ ను హీరోగా పరిచయం చేయనున్నారు ఈ ఇద్దరు డైరెక్టర్లు..
Read More: Anushka – Naveen: అనుష్క నవీన్ పోలిశెట్టి సినిమా కిరాక్ టైటిల్..!!
ప్రొడక్షన్ నెంబర్.1 గా ఎస్పీ క్రియేషన్స్ పై రూపొందుతుంది. ఈ చిత్రం లవ్, సస్పెన్స్ ఎంటర్టైనర్ గా రూపొందుతుంది. ఈ సినిమాలో అన్నిరకాల కమర్షియల్ హంగులతో తెరకెక్కించనున్నారు మేకర్స్. డైరెక్టర్స్ రమేష్ – గోపి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 4వ సినిమాలో శోభన్ యువ కథానాయకుడిగా పరిచయమవుతున్నాడు.. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.. కరోనా వైరస్ తీవ్రత తగ్గగానే రెగ్యులర్ షూటింగ్ ను మొదలు పెడతామని తెలిపారు. ఇప్పటికే శోభన్ యాక్టింగ్, డాన్స్, ఫైటింగ్ ఇలా పలు అంశాల్లో శిక్షణ తీసుకున్నాడు. ఈ సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు గుర్తుండి పోతాడు అని మేకర్స్ తెలిపారు.