నేను విచారణకు రెడీ.. కానీ పోలీసులే ఏర్పాట్లు చేయలేదు – డాక్టర్ రమేష్ కొత్త కథ!

విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ సెంటర్ లో జరిగిన అగ్ని ప్రమాదం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అగ్ని ప్రమాదంలో 11 మంది మరణించారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి బాధ్యులపై విచారణ జరపాలని పోలీసులు ప్రయత్నించారు. కానీ రమేష్ ఆసుపత్రి యాజమాన్యం డాక్టర్ పోతిన రమేష్ మాత్రం విచారణకు రాకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు.

 

అంతేకాదు అతనిపై ఎటువంటి విచారణ జరగకుండా చర్యలు తీసుకోకుండా హైకోర్టులో స్టే కూడా తెచ్చుకున్నాడు రమేష్. అయితే రమేష్ అజ్ఞాతంలోకి వెళ్లడంతో రమేష్ ఆచూకీ తెలిపిన వారికి లక్ష రూపాయిలు బహుమతి ఇస్తాం అని ప్రకటించారు. అయినా సరే దొరకలేదు. అయితే అజ్ఞాతంలో ఉండి స్టే తెచ్చునా రమేష్ ను విచారించేందుకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా అతన్ని అరెస్ట్ చెయ్యకూడదని తెలిపింది.

అయితే రమేష్ కి కూడా పోలీసులకు పూర్తిగా సహకరించాలని నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ రమేష్ స్పందనా అందరికి షాక్ కి గురి చేసింది. పోలీస్ స్టేషన్ కి ఎవరు అంటే వారు వస్తారని.. అక్కడ కరోనా సోకే ప్రమాదం ఉందని.. అందుకు గాను అతన్ని వీడియో కాన్ఫరెన్సు ద్వారా చేయాలని అతను సమాధానం ఇచ్చాడు. మరి రమేష్ సమాదానినికి కోర్టు ఎలా స్పందిస్తుందనేది చూడాలి.