Rashmika Mandana: ఛలో సినిమా తో తెలుగు తెరకు పరిచయమైంది రష్మీక.. ఆ తరవాత వరుస ఆఫర్స్ సొంతం చేసుకుంది.. విజయ్ దేవరకొండ తో నటించిన గీత గోవిందం తో అమ్మడి గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది.. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో కన్నడ బ్యూటీ క్రేజ్ మరింత పెంచేసింది.. సోషల్ మీడియాలో యమా ఆక్టివ్ గా ఉంటుంది రష్మీక.. ఇటీవల నేషనల్ క్రష్ గా నిలిచింది.. తాజాగా రష్మీక ఇన్స్తాగ్రామ్ లో 19.2 M ఫాలోయర్స్ సొంతం చేసుకొని మరో మైలురాయి ని చేరుకుంది..!!
సోషల్ మీడియాలో రష్మీక షేర్ చేసిన ఏ పోస్ట్ అయిన నిమిషాల్లో వైరల్ అవుతుంది.. అది ఈ అమ్మడి క్రేజ్.. తన సినిమా షూటింగ్, పర్సనల్ విషయాలు అన్ని తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది.. వరుస సినిమాలతో బిజీగా ఉన్న అభిమానులతో అప్పుడు లైవ్ లోకి ముచ్చటిస్తూ ఉంటుంది.. వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది.. ప్రస్తుతం బన్నీ సరసన పుష్ప సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అటు బాలీవుడ్ లో అరెంగెట్రం చేయనుంది.. అలాగే కోలీవుడ్ లో కూడా వరుస సినిమాలలో నటిస్తోంది.. ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన అతి కొద్ది కాలంలోనే ఇంత మంది ఫాలోవర్స్ ను సొంతం చేసుకోవడం రష్మీక కే సాధ్యమైంది..