Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో టాప్ మోస్ట్ కంటెస్టెంట్ లలో ఒకరు యాంకర్ రవి. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లో అందరి కంటే భారీ క్రేజ్ అన్న కంటెస్టెంట్ రవి. తన యాంకరింగ్ తో.. అదిరిపోయే పంచ్ డైలాగులతో.. టెలివిజన్ ప్రేక్షకులను నవ్వించే రవి బిగ్ బాస్ హౌస్ లో… తనదైన శైలిలో రాణిస్తున్నాడు. హౌస్ లో కూడా సందడి చేస్తూ.. ప్రతి విషయంలో కలుగ చేసుకుంటూ.. సరికొత్త వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నాడు.
ఇలా ఉంటే ఆదివారం రవి పుట్టిన రోజు సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ముఖ్యంగా రవి కూతురు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న రవి కి సరికొత్త సర్ ప్రైజ్ గిఫ్ట్ బెలూన్స్ రూపంలో అందించడం జరిగింది. బిగ్ బాస్ హౌస్ బయట రవి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున.. బాణాసంచాలు కాలుస్తూ.. రవి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో రవి కూతురు కేక్ కట్ చేసి తండ్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడం మాత్రమే కాక అరవింద్ గుర్తు చేసుకుని ఏడ్చేసింది. రవికి బర్తడే విషెస్ తెలియజేస్తూ గాల్లోకి బుడగలు వదిలింది రవి కూతురు.
అదే రీతిలో సోషల్ మీడియాలో రవి అభిమానులు కూడా బర్తడే విషెస్ తెలియజేయడం జరిగింది. మొత్తంమీద ఆదివారం రవి బర్త్ డే సందర్భంగా బిగ్ బాస్ హౌస్ బయట.. రవి కుటుంబ సభ్యులు సన్నిహితులు భారీగానే.. సందడి చేస్తూ గాల్లోకి బెలూన్ లు వదిలారు. మొన్న షణ్ముఖ్ జస్వంత్ బర్తడే ఆ తర్వాత రవి బర్తడే.. అయినా క్రమంలో.. బిగ్ బాస్ హౌస్ బయట.. ఎప్పుడు లేని విధంగా.. కుటుంబ సభ్యులను.. రాణిస్తూ.. ఇంటిలో ఉన్న సభ్యులకు ఆకాశంలో.. శుభాకాంక్షలు తెలియజేసిన ఏర్పాట్లు చేయటం ఈ సీజన్లో హైలెట్.