సుమ యాంకర్ గా చేసే క్యాష్ గేమ్ షో కి ప్రజాదరణ చాలా ఎక్కువ అని తెలిసిందే. అయితే ఈ మధ్యన ఈ షోలో ఫన్ తో పాటు రొమాన్స్ కూడా తోడవుతుంది. సాధారణంగా కామెడీ ఆర్టిస్టులను లేదా సినిమా వారిని ఈ ప్రోగ్రామ్ కు ఆహ్వానిస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య ప్రేమ జంటలను, ఎన్నో రూమర్లు ఉన్న యాంకర్లను షో కి పిలుస్తున్నారు. వారు కూడా అదే రేంజ్ లో దుమ్ము లేపుతున్నారు.
ఇక ఈ షో లో రొమాన్స్ రోజురోజుకీ పిక్స్ కు చేరుతుంది. అలాగే షో టీమ్ కూడాఅ ప్రతిసారి క్యాష్ షో ప్రోమో భలే ఎడిట్ చేస్తున్నారు. ఇలాంటి సీన్లు కట్ చేసి చూపిస్తే ఎంత వైరల్ అవుతుందో వారికి అర్థం అయిపోయింది. వచ్చే వారం ఎపిసోడ్ క్యాష్ లో ఆమె కథ హీరో బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ రవి కృష్ణ, హీరోయిన్ నవ్య స్వామి గెస్ట్ గా వచ్చారు. రవికృష్ణ వచ్చిందంటే మనకి తెలుసు బిగ్బాస్ లో ఎంతో అన్యోన్యంగా ఉండే శివ జ్యోతి కూడా వచ్చేస్తుంది అని. అసలే వీరిద్దరిదీ బిగ్ బాస్ కలిపిన బంధం.
ఇక ఈ షో లో ఇద్దరూ సెటైర్లతో రెచ్చిపోయారు. ఇదే సమయంలో సుమ రవి కి ఒక టాస్క్ ఇచ్చింది. వర్షంలో తడుస్తూ చెట్టుకింద ఉన్న ఒక ప్రేమ జంట గా నటించమని రవి, నవ్య లకు చెప్పింది. అదే సమయంలో మొక్కజొన్నపొత్తులు అమ్ముకునే క్యారెక్టర్ లో సుమ అక్కడికి వచ్చింది. వెంటనే రవి కృష్ణ తో నువ్వు గతేడాది ఇంకొక అమ్మాయి కూడా ఇలాగే కనిపించవు అంటూ బుక్ చేసింది. అదే సమయంలో నవ్య స్వామి మోకాళ్లపై కూర్చుని రవి కృష్ణ కు ప్రపోజ్ చేసింది. వెంటనే రవి నవ్య స్వామిని ముద్దుపెట్టుకున్నాడు. దీంతో సుమ షాక్ కు గురి అయింది. చేతులు వణికిస్తూ ఇది మనం అనుకున్న దాంట్లో లేదు అని భయం చూపెట్టింది. ఈ సీన్ ని వేరే లెవల్ కి తీసుకెళ్దామని నేనే చేశా అంటూ రవి కృష్ణ అంటే అక్కడ ఉన్నవారంతా అవ్వక్కయిపోయారు.