రవి ప్రకాష్ కొత్త మీడియా పార్ట్నర్ అతడేనా?

రవి ప్రకాష్.. ఈ పేరు తెలియని వారు ఉండరు. తెలుగులో ఎలక్ట్రానిక్ మీడియాకు కొత్తదనం తీసుకొచ్చి టీవీ9 ని ఓ రేంజ్ కు తీసుకొచ్చిన వ్యక్తి అతడు. అలాంటి వ్యక్తి కొన్నిఅవకతవకలు చెయ్యడంతో టీవీ9లో 90 శాతం ఇన్వెస్ట్ చేసిన యజమానులు అతడిపై ఫిర్యాదు చేసి అరెస్ట్ చేయించారు. ఇక ఆ ఛానెల్ నుంచి అతన్ని పంపేశారు.

 

అయితే రవి ప్రకాష్ సత్తా ఏంటో మన రాజకీయనాయకులకు తెలియనిది కాదు.. టీవీ9లో ఉన్నప్పుడే రాజకీయంగా సర్కిల్ బాగా పెంచుకున్నాడు. ఇక అందుకే అతడు త్వరలో కొత్త ఛానెల్ పెట్టనున్నాడని దానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కొడుకు నారా లోకేష్ పెట్టుబడులు పెట్టనున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయ్.

టీవీ9లో పని చేసిన ఓ మాజీ యాంకర్ రవిప్రకాష్ కి నారాలోకేష్ కి వారధిగా పని చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయ్. అయితే ఇప్పటికే రవి ప్రకాష్ భారీ స్థాయిలో టీంని రెడీ చేస్తున్నట్టు కొత్త ఛానెల్ ని త్వరలోనే లాంచ్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయ్. అయితే ప్రస్తుతం కొత్త ఛానెల్ కి లైసెన్స్ ఇచ్చే అవకాశం లేదని కాబట్టి ఇప్పటికే ఉన్న ఛానెల్ పేరు మర్చి వాడుకునేలా ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ వార్తల్లో నిజం ఎంత అనేది తెలియాలంటే మరి కొద్దీ కాలం ఆగాల్సిందే.