Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ 6 హోస్ట్ గా కొత్త పేరు రవితేజ తెరపైకి వచ్చింది. సీజన్ సిక్స్ ఓటిటి అని ప్రకటించిన సమయంలో నాగార్జున తనకి తానుగా హోస్ట్ గా… ప్రకటించుకున్నారు. దీంతో వరుసగా నాలుగో సారి.. తెలుగు బిగ్ బాస్ షోకి హోస్ట్ గా.. నాగార్జున అవకాశం దక్కించుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇంతలోనే బాలకృష్ణ పేరు తెరపైకి వచ్చింది. “ఆహా” ఓటిటిలో “అన్ స్తాపబుల్” అనే టాకీ షోకి హోస్ట్ గా ఫుల్ ఎనర్జీతో సెలబ్రిటీలను బాలయ్య ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు.
హోస్ట్ గా బాలయ్య లో ఉన్న కొత్త కోణం.. చాలా మంది వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇటువంటి తరుణంలో బాలకృష్ణ ఓటిటీ బిగ్ బాస్ కి… వస్తున్నట్లు మొన్నటి దాకా వార్తలు వచ్చాయి. కానీ తాజాగా మాత్రం నాగార్జున, బాలకృష్ణ కాకుండా… మాస్ మహారాజా రవితేజనీ… హౌస్ లోకి తీసుకు రావటానికి రెడీ అవుతున్నారట. రవితేజ కూడా యాంకరింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు… ఇందుకుగాను భారీ రెమ్యునరేషన్ డిస్నీ హాట్ స్టార్.. అదే రీతిలో మా టీవీ యాజమాన్యం.. ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
పరిస్థితి ఇలా ఉంటే మరోపక్క బిగ్ బాస్ ఓటిటి కంటెస్టెంట్ దాదాపు చాలా మందిని సెలెక్ట్ చేసినట్లు… త్వరలో వారిని క్వారెన్ టైన్ లోకి పంపించి… బిగ్ బాస్ సిక్స్ కి సంబంధించి..ప్రోమో షూట్ స్టార్ట్ చేసే ఆలోచనలో షో నిర్వాహకులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గత తెలుగు బిగ్ బాస్ సీజన్ లకు భిన్నంగా… ఈసారి 24 గంటలు హౌస్ రోజు జరిగేది చూపించడానికి షో నిర్వాహకులు ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో..ఓటిటి బిగ్ బాస్ ఏ విధంగా ఉంటుందో అని ఉత్కంఠభరితంగా ఆడియెన్స్ ఎదురుచూస్తూ ఉన్నారు.