ట్రెండింగ్

స్నేహితుల రోజున ఆగస్ట్ మొదటి ఆదివారం ఎందుకు జరుపుకుంటారు? ఇది చదివి తెలుసుకోండి.

Friendship Day 2022 NewsOrbit
Share

 స్నేహితుల రోజు: అయితే ఈ అద్భుతమైన స్నేహాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు భారతదేశంలో ఆగస్టు నెలలో మొదటి ఆదివారాన్ని ప్రత్యేకంగా కేటాయించారు. ఏటా ఆగస్టు ఫస్ట్ సండేని స్నేహితులందరూ ఎంతో గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటారు

స్నేహితుల రోజు: ఒకే రక్తం పంచుకుని… ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా కల కాలాలపాటు నిలిచే బంధం స్నేహబంధం అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈ బంధంలో అన్నిటినీ ఆప్యాయంగా పంచుకోవడమే గానీ తుంచడం ఎక్కడా కనిపించదు. అందుకే స్నేహ బంధానికి మించినది ఏదీ లేదని అంటారు. కేవలం ప్రేమతోనే ఏర్పరచుకునే ఈ అనుబంధం వెలకట్టలేనిది. అవసరంలో అండగా చేయి అందించే వాడే అసలైన స్నేహితుడు. అందుకే ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇజ్‌ ఏ ఫ్రెండ్ ఇండీడ్ అని అంటారు. ఈ కారణంగానే నిజమైన స్నేహితులకు మించిన ఆస్తి లేదని అంటారు. త్యాగం అనేది స్నేహబంధంలో అడుగడుగునా కనిపిస్తూనే ఉంటుంది.

 స్నేహితుల రోజు: Friendship Day 2022
స్నేహితుల రోజు :Best Friendship Day 2022 Quotes from NewsOrbit

 

అయితే ఈ అద్భుతమైన స్నేహాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు భారతదేశంలో ఆగస్టు నెలలో మొదటి ఆదివారాన్ని ప్రత్యేకంగా కేటాయించారు. ఏటా ఆగస్టు ఫస్ట్ సండేని స్నేహితులందరూ ఎంతో గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ రోజున ఫ్రెండ్‌షిప్ బ్యాండ్‌ను చేతికి కట్టి కట్టె కాలే వరకూ అండగా ఉంటామని ఒకరికొకరు ప్రతిజ్ఞ చేస్తారు. ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. గట్టిగా కౌగిలించుకొని ప్రేమను వ్యక్త పరుస్తారు.

స్నేహితుల రోజున ఆగస్ట్ మొదటి ఆదివారం ఎందుకు జరుపుకుంటారు?

Friendship Day 2022 Quotes
Friendship Day 2022 Quotes

స్నేహానికన్న మిన్న.. లోకాన లేదురా.. కడ దాక నీడ లాగా.. నిను వీడి పోదురా అని తెలుగు సినీ గేయ రచయిత భువనచంద్ర రాసిన ప్రతి పదం కూడా అక్షర సత్యం అని చెప్పొచ్చు. వయస్సు, జాతి లేదా మతంతో సంబంధం లేకుండా పూర్తిగా ఒకరిపై ఒకరు ప్రేమ, గౌరవంతో ఏర్పడిన బలమైన బంధం ఇది. నిజానికి జులై 30న ఇంటర్నేషనల్ ఫ్రెండ్‌షిప్ డేగా జరుపుకుంటారు. భారతదేశంలో మాత్రం ఆగస్టు మొదటి ఆదివారం జరుపుకుంటారు. అందుకే ఈ ఏడాది ఆగస్ట్ మొదటి ఆదివారం ఈ రోజే రావడంతో 7వ తేదీన స్నేహితుల రోజు అయ్యింది. అయితే భారతదేశంలో ఆగస్టు మొదటి ఆదివారాన్నే స్నేహితుల దినోత్సవంగా జరుపుకోడానికి కచ్చితమైన కారణం తెలియదు.

 

స్నేహితుల రోజు: హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే 2022 తేదీ చరిత్ర

 

హాల్‌మార్క్ కార్డ్స్ వ్యవస్థాపకుడు జాయిస్ హాల్ 1930, ఆగస్ట్ 2న ఫ్రెండ్‌షిప్ డే జరుపుకోవాలని చెప్పాడు. అయితే అంతకంటే ముందు గ్రీటింగ్ కార్డ్‌లు అమ్ముడుపోవాలని దీనిని జరుపుకోవాలని ఇంకొందరు చెప్పారు. దాంతో ఇదొక బిజినెస్ ట్రిక్ అని అమెరికా వ్యక్తులు ఎవరూ కూడా దీనిని అంతగా పట్టించుకోలేదు. అయితే చాలా ఆసియా దేశాలు స్నేహితుల రోజును జరుపుకోవడం ప్రారంభించాయి. 1958లో తొలిసారిగా స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకున్నారు.

Friendship Day 2022 NewsOrbit
Friendship Day 2022 Wishes and Quotes

1958లో వరల్డ్ ఫ్రెండ్‌షిప్ క్రూసేడ్ కూడా స్నేహితుల దినోత్సవం జరుపుకోవాలని ప్రతిపాదించింది. కానీ అది విజయవంతం కాలేదు. ఆ తర్వాత కూడా స్నేహితుల దినోత్సవానికి అంతగా ప్రాముఖ్యత రాలేదు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 2011లో అంతర్జాతీయ స్నేహ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించగా.. తొలిసారిగా 2012లో ఫ్రెండ్‌షిప్ డే జరుపుకున్నారు. అప్పటి నుంచి వివిధ దేశాలు వేర్వేరు తేదీల్లో ఫ్రెండ్‌షిప్ డేని జరుపుకుంటున్నాయి.  భారతదేశం ఆగస్టు మొదటి ఆదివారం రోజును పాటిస్తుంది.

 

 


Share

Related posts

బిగ్ బాస్ 4: బిగ్ బాస్ వేదికపైకి టాప్ హీరో తో మరికొంతమంది..??

sekhar

Bigg Boss 5 Telugu: ఎమోషనల్ పోస్ట్ పెట్టిన నటరాజ్ మాస్టర్..!!

sekhar

Gopichand: గోపీచంద్ 12 సంవత్సరాల నుండి చేస్తున్న ఒక గొప్ప పని..!!

sekhar