Republic : మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ అంటూ స్ట్రాంగ్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. దేవకట్టా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ రామ్ చరణ్ విడుదల చేసాడు.. “ప్రభుత్వం ఉందన్న భ్రమలో మనమంతా జీవిస్తున్నాం.. కానీ మనకు ఇంకా ఆ ప్రభుత్వం ఎలా ఉంటుందో కూడా తెలీదు”.. అనే స్ట్రాంగ్ మేసేజ్ తో కూడిన ఈ రిపబ్లిక్ ఫస్ట్ లుక్ పోస్టర్.. సినిమా కథ ఎంత ఆసక్తికరంగా ఉండనుందో తెలుపుతోంది..

ఈ చిత్రాన్ని పొలిటికల్ నేపథ్యంలో రొమాంటిక్ అంశాలు జోడించి రూపొందిస్తున్నారు మేకర్స్.. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన నివేదా పేతురాజ్ నటిస్తోంది.. సీఎం పాత్రలో సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ నటించడం విశేషం.. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.. ఈ సినిమా జూన్ 4 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది..