బిగ్ బాస్ హౌస్ లోకి మరొక అందగత్తె ఎంటర్ అయింది. ఆర్జీవి తో జరిగిన ఒక ఇంటర్వ్యూలో వివాదాస్పద దర్శకుడి నుండి తన అందానికి ప్రశంసలందుకున్న యాంకర్ అరియానా గ్లోరీ నేరుగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయిపోయింది.
“మీ తొడలు బాగా ఉన్నాయి“ అంటూ ఆర్జీవి ఆమెకు డైరెక్ట్ గా కాంప్లిమెంట్ ఇవ్వడంతో ఒక్కసారిగా షూట్ లోనే ఆమె సిగ్గుమొగ్గలయిన వీడియో అప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అయితే అరియానా తన ప్రోమో లో బోల్డ్ గానే తాను ఎప్పుడూ ఉంటానని…. ఇప్పుడు బిగ్ బాస్ లో కూడా అలాగే కొనసాగుతానని చెప్పడం గమనార్హం.
తనలో ఆత్మస్థైర్యం ఎక్కువ అని చెప్పిన ఈమె ఎంతో యాక్టివ్ గా యంగ్ అండ్ ఎనర్జిటిక్ గా కనిపిస్తుంది. అయితే అరియానా అసలు పేరు అది కాదని నాగార్జున చెప్పేశాడు. ఆమెకు ఫేస్ రీడింగ్ కూడా తెలుసట. మరి కంటెస్టెంట్స్ మనోభావాలు చదివేసి అందుకు తగ్గట్టు అరియానా నడుచుకుంటుందా లేదా అన్నది తెలుసుకోవాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.