సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత అతని గర్ల్ ఫ్రెండ్ అయిన రియా చక్రబోర్తి పైన జాతీయ మీడియా అంతా తీవ్రంగా విరుచుకుపడింది. పైగా కేసు విచారణలో ఆమెకు ప్రతికూలంగా అనేక ఆధారాలు దొరకడం తో ఒక్కసారిగా ఆమె భారత దేశంలో చాలామందికి బద్ధశత్రువు అయిపోయింది.
ఇక తీగ లాగితే డొంక అంతా కదిలినట్లు సుశాంత్ కి డ్రగ్స్ అలవాటు చేయడం…. అలాగే అతని బ్యాంకుల నుండి లక్షల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టడం వంటివి ఎన్నో బయటపడ్డాయి. దీనిపై సిబిఐ వారు, ఎన్సీబీ వారు రియా ను విచారణ చేశారు. కోర్టువారు కూడా ఈమెకు బెయిల్ ను నిరాకరించారు.అలా అరెస్టు అయిన రియా ఈ డ్రగ్స్ వివాదంలో తనతో పాటు చాలా మంది ప్రముఖులు ఉన్నట్లు పేరు వెల్లడించింది.
వారిలో రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్ ముఖ్యలు. అలాగే ‘దిల్ బేచెరా’ సినిమా డైరెక్టర్ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు…. తను సప్లై చేసినట్లు చెప్పింది. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖుల గుండెల్లో గుబులు మొదలైంది. రియా ఎప్పుడు ఎవరి పేరు చెబుతుందో తెలియక చచ్చి పోతున్నారు. అలాగే రియాతో క్లోజ్ గా ఉండే మరొక తెలుగు హీరోయిన్ రకుల్ పేరు బయటకు రావడంతో మరో తెలుగు హీరోయిన్ ఘోరంగా వణికిపోతూ ఉందట. రకుల్, రియా, సారా వీరంతా ఒకే జిమ్ కు వెళ్తారు.
అక్కడ వీరికి పరిచయమై స్నేహితులుగా మారారు. ఇక్కడే డ్రగ్స్ విషయమై వారంతా ఒక మాట అనుకొని వాటిని తెప్పించుకొని వాడినట్లుగా అధికారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు రకుల్ ఆతో పాఱ్టు రియా ఆ తెలుగు హీరోయిన్ పేరు కూడా బయటకు చెప్పబోతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తను తెలుగు హీరోయిన్ రకుల్ అంతటి స్థాయి స్టార్ హీరోయినా లేకపోతే చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్న విషయం మాత్రం ఎవరికీ తెలియదు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?