ట్రెండింగ్ న్యూస్ సినిమా

Roar Of RRR: “రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్” మేకింగ్ వీడియో అదిరిపోయింది..!! థియేటర్లో రచ్చ రచ్చే..!!

Share

Roar Of RRR: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న  ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్..!! అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.. ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్నారు.. ఈచిత్రంలో వీరిద్దరి ని పరిచయం చేస్తున్న టీజర్స్ ఎన్ని రికార్డులు సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. బాహుబలి తరువాత జక్కన్న దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.. తాజాగా ఈ చిత్రం నుండి అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నా “రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్” మేకింగ్ వీడియోను విడుదల చేశారు మేకర్స్..!!

Roar Of RRR: making video out now
Roar Of RRR: making video out now

ఈ మేకింగ్ వీడియోలో ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు, ఇందులో నటిస్తున్న అందరిని చూపించారు.. ఈ వీడియోలో చూపించిన సీన్స్, స్టంట్స్ , బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూస్తుంటే సినిమాపై అంచనాలు మిన్నంటుతున్నాయి.. అటు మెగా అభిమానులు ఇటు జూనియర్ అభిమానులు ఈ వీడియో చూసి ఖుషి అవుతున్నారు. ఈ చిత్రంలో నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ , ఒలీవియా మోరిస్, అలియా భట్, అజయ్ దేవగన్ , శ్రీయ, రాజమౌళి సీన్స్ ని వివరిస్తున్న సన్నివేశాలు వీడియో లో చూపించారు. ఈ సినిమా షూటింగ్ 90 శాతం వరకు పూర్తయింది.. రెండు పాటలు మినహా మిగతా షూటింగ్ మొత్తం పూర్తయింది.. ఈ నెలాఖరుకల్లా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని.. ఆగస్టులో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పై దృష్టి సారించనున్నారు రాజమౌళి.. ముందుగా ప్రకటించినట్లుగానే ఈ చిత్రాన్ని 13 అక్టోబర్ 2021  ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదల చేయనున్నారు.. మేకింగ్ వీడియోనే ఇలా ఉంటే థియేటర్లో రచ్చ రచ్చే అంటున్నారు ఈ వీడియో చూసిన అభిమానులు.. రాజమౌళి మేకింగ్ వీడియో తోనే అంచనాలు తారాస్థాయికి తీసుకెళ్లాడు.. రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ మేకింగ్ వీడియోను మీరు ఒకసారి చూసేయండి..


Share

Related posts

జాజికాయ గురించి తెలుసుకుంటే తప్పకూండా వాడతారు!!

Kumar

Today Gold Rate: పైపైకి కదిలిన బంగారం.. భారీగా పడిపోయిన వెండి..!!

bharani jella

YSRCP : వైసీపీ టార్గెట్ పై నేతలు మల్లగుల్లాలు -! నిమ్మగడ్డా ఎంత పని చేస్తివి..!!

somaraju sharma