RRR: ఇండియాలో కాక ఇంటర్నేషనల్ స్థాయిలో “RRR” ఎన్ని భాషల్లో రిలీజ్ అవుతుందో తెలుసా..??

Share

RRR: “బాహుబలి” వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో “RRR” వస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా మాత్రమే కాదు అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాపై మంచి ఇంట్రెస్ట్ నెలకొంది. “బాహుబలి” తో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్థాయి పెంచేయడంతో రాజమౌళి పేరు సినిమా ప్రపంచంలో డబల్ త్రిబుల్ గా వినపడటం తో..”RRR” ఏ స్థాయి విజయం సాధిస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది. రామ్ చరణ్ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. వాస్తవానికి పాండమిక్ పరిస్థితులు రాకుండా ఉంటే ఈపాటికి సినిమా రిలీజ్ అయి ఉండేది.

Who's More Pressurised, Post RRR – Jr NTR or Ram Charan?

గత ఏడాది జూన్ మాసం లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా తర్వాత ఈ ఏడాది జనవరి నెలకు వాయిదా పడింది కానీ మధ్యలో కరోనా ఎంట్రీ తో పాటు దేశంలో సెకండ్ వేవ్ తీవ్రత వల్ల అనేక సమస్యలు ఏర్పడటంతో ఈ సినిమా వచ్చే దసరా కి విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే “RRR” సినిమాకి సంబంధించి డిజిటల్ రైట్స్ రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి.

Read More: Mahesh Babu : రాజమౌళి సినిమాపై ఆశలు పెట్టుకున్న మహేష్ అభిమానులకు షాక్

ఇదిలా ఉంటే ఈ సినిమా మొదటి తెలుగు, తమిళం,  మలయాళం, కన్నడం, హిందీ భాషలలో తెరకెక్కిస్తున్న గా తర్వాత క్రేజ్ ఉన్న కొద్ది పెరగటంతో మొత్తం ఇప్పుడు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 12 భాషల్లో రిలీజ్ కానుంది. మనదేశంలో 5 భాషలతో పాటు ఇంగ్లీష్, పోర్చుగీస్, కొరియన్, టర్కీష్ లాంగ్వేజ్, స్పానిష్, జపనీస్, చైనీస్  భాషలలో  నెట్ఫ్లిక్స్  ద్వారా స్ట్రీమ్  కానుందట. దాదాపు ఒక ఇండియా సినిమా ఈ రీతిలో అన్ని భాషల్లో రిలీజ్ కావడంతో “RRR” ప్రపంచ సినీ రంగంలో సంచలనం క్రియేట్ చేసినట్లయింది. 


Share

Related posts

Big Breaking; సీఎం జగన్ తిరుపతి పర్యటన రద్దు..! ఎందుకంటే..?

somaraju sharma

ప్రభాస్ తమ్ముడిగా ఎలాంటి హీరో సెలెక్టయ్యాడబ్బా.. ఇక కథ మామూలుగా ఉండదు…?

GRK

జ‌గ‌న్ పుట్టిన రోజు … రోజా నిజంగా గ్రేట్

sridhar