RRR Movie : రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్.. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.. తాజాగా ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్ డేట్ వచ్చేసింది.. చెర్రీ – ఆలియా భట్ ల రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణ చేయనున్నట్లు తాజా సమాచారం..
ఆర్ఆర్ఆర్ మూవీ లో త్వరలోనే పాటల చిత్రీకరణ ప్రారంభం కానుంది. రామ్ చరణ్, ఆలియా భట్ పై రొమాంటిక్ సాంగ్ ను మార్చి 12 నుంచి త్రీకరించనున్నారట మేకర్స్. ఇందుకోసం హైదరాబాద్ లో ఒక సెట్ ను కూడా సిద్ధం చేశారని తాజా సమాచారం. ఈ రొమాంటిక్ సాంగ్ స్క్రీన్ పై ఎంత అద్భుతంగా ప్రెజెంట్ చేస్తారో చూడాలి. ఈ చిత్రంలో చెర్రీ అల్లూరి గా, జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా కనిపించనున్నారు.. ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను డి.వి.వి.దానయ్య 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి ప్రేక్షకుల్లో.. ఈ చిత్రాన్ని అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు..