RRR Movie: ఆర్ఆర్ఆర్ కిర్రాక్ అప్డేట్..!! ఫస్ట్ సాంగ్ విడుదల ఆరోజే..!!

Share

RRR Movie: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్.. మల్టీ స్టారర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.. ఇద్దరు స్వాతంత్ర సమరయోధులు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న కల్పిత కథ ఆర్ఆర్ఆర్ రౌద్రం రణం రుధిరం.. ఈ చిత్రంలో లో కొమరం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ నటిస్తున్నారు.. వీరిద్దరి సరసన ఒలివియా మోరీస్, అలియాభట్ నటిస్తున్నారు. ప్రముఖ నటుడు అజయ్ దేవగన్ కీలకపాత్ర  పోషిస్తున్నారు. సినిమా కోసం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎదురుచూస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు.. తాజాగా ఈ చిత్రం నుండి లేటెస్ట్ అప్ డేట్ వచ్చేసింది.. ఆర్ఆర్ఆర్ చిత్రం నుండి మొదటి పాటను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు చిత్ర యూనిట్..!!

RRR Movie: Them Dosthi Song Release date announced

ఈ చిత్రం నుండి ఫ్రెండ్ షిప్ డే రోజున ఒక పాట విడుదల అవుతుంది అంటూ సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.. ఇప్పుడు అదే వార్తలను నిజం చేసింది ఆర్ఆర్ఆర్ టీమ్.. ఆగస్టు 1న ఉదయం 11 గంటలకు కు ఆర్ఆర్ఆర్ నుంచి మొదటి పాట దోస్తీ పేరుతో విడుదల చేయనున్నారు. ఐదు భాషలలో 5 ప్రముఖ గాయకులు ఈ పాటను ఆలపించారు. ఈ సాంగును ఐదు భాషల్లో విడుదల కానుండటంతో ఆర్ఆర్ఆర్ అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.. ఈ పాటను తెలుగులో సిరివెన్నెల సీతారామశాస్త్రి లిరిక్స్ రాయగా, కీరవాణి సంగీత సారథ్యంలో హేమచంద్ర పాడనున్నారు.. మిగతా నాలుగు భాషల్లో అనుదీప్, అమిత్ త్రివేది, విజయ్ ఏసుదాసు, నజీర్ ఈ పాటను ఆలపించారు.. అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ విడుదల కానుంది..


Share

Recent Posts

సాంగ్స్ సూప‌ర్ హిట్‌.. సినిమాలు ఫ‌ట్‌.. పాపం ఆ ఇద్ద‌రు హీరోల ప‌రిస్థితి సేమ్ టు సేమ్‌!

టాలీవుడ్‌లో టైర్-2 హీరోల లిస్ట్‌లో కొన‌సాగుతున్న ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ స్టార్ నితిన్ ల‌కు సేమ్ టు సేమ్ ఒకే ప‌రిస్థితి ఏర్ప‌డింది. పూర్తి…

25 mins ago

గుండెకు హత్తుకునే సినిమాలు చేయాలి అంటున్న బండ్ల గణేష్..!!

మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ వైరస్ దాటికి అనేక రంగాలు కుదేలు అయిపోయాయి. ముఖ్యంగా సినిమా రంగం…

1 hour ago

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…

2 hours ago

వరంగల్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించిన పూరి..!!

ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…

3 hours ago

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…

4 hours ago

హీరోయిన్ల‌కే అసూయ పుట్టిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. లెటేస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌న్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…

5 hours ago