Ruby Roman: ఈ గ్రేప్స్​ మస్త్‌‌ కాస్ట్‌‌లీ..!! ఎందుకంటే..

Share

Ruby Roman: సాధారణంగా మనం ఒక కేజీ ద్రాక్ష పండ్లను కొనాలంటే 100 లేదా 200 పెట్టి కొంటాం.. ఒకవేళ ద్రాక్ష లో ఏదైనా ప్రత్యేక రకమైతే మహా అయితే మరో వంద ఎక్కువగా చెల్లిస్తాం.. అయితే జపాన్ లో దొరికే ఈ గ్రేప్స్ ధర తెలిస్తే షాక్ అవుతారు.. ఒక గుత్తి ద్రాక్ష ధర లక్షలలో ఉంటుంది.. అదే ఒక పండు కొనాలంటే వేలలో చెల్లించాలి.. ఈ ద్రాక్ష ప్రత్యేకత ఏంటి..!? ఎందుకు ఇంత ధర చెల్లించాలో తెలుసుకుందాం..!!

Ruby Roman: Grapes are very costly in world
Ruby Roman: Grapes are very costly in world

Ruby Roman: రూబీ రోమన్ గ్రేప్స్ మస్త్ కాస్ట్‌‌లీ..!! కారణం ఇదే..!!

జపాన్ లో రూబీ రోమన్ అనే రకం ద్రాక్ష ను పండిస్తున్నారు. ఈ గ్రేప్స్ ఎక్కడ పడితే అక్కడ దొరకవు. ఇవి జపాన్ లో ఇషికావా లో మాత్రమే దొరుకుతాయి. ఇవి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే దొరుకుతాయి.. వీటి కోసం జపాన్ ప్రజలు ఎగబడి మరీ ఉంటారని వ్యాపారులు చెబుతున్నారు.. ఈ గ్రేప్స్ ను ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వాళ్ళు అమ్మడానికి కూడా లేదు. ఇషికావా అడ్మినిస్ట్రేషన్ నిబంధనల ప్రకారం మాత్రమే వాటిని అమ్మాలి. అంతే కాదండోయ్ వాళ్ళు క్వాలిటీ చెక్ చేసి స్టిక్కర్ వేసినవి మాత్రమే కొనాలి. రూబీ రోమన్ ద్రాక్ష కు 2020 సంవత్సరం లో వేలం పాట పెడితే ఈ ద్రాక్ష ఒక్క గుత్తి కి సుమారు 400 డాలర్లకు కొన్నారు. అంటే మన దేశ కరెన్సీ ప్రకారం రూ. 35,000.

Ruby Roman: Grapes are very costly in world
Ruby Roman: Grapes are very costly in world

సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ పంట పండుతుంది. కేవలం 24 వేల గుత్తులు మాత్రమే కాస్తాయట. ఈ ద్రాక్ష కాయలు ఒకే రంగు, ఒకే సైజులో ఉంటాయి. వీటి రుచి మాత్రం అద్భుతంగా ఉంటుందట. సాధారణంగా మనం తినే ద్రాక్ష నే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది.. అనేక అనారోగ్య సమస్యలు తలెత్తకుండా చేస్తుంది.. మరి రూబీ రోమన్ ద్రాక్ష పండ్లు తింటే ఆరోగ్యానికి ఎంత మేలు చేకూరుస్తాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. పండ్లు అత్యంత ఎక్కువ ధర కి అమ్ముడు పోయి కాస్ట్‌‌లీ గ్రేప్స్ గా గుర్తింపు తెచ్చుకున్నాయి..!!


Share

Related posts

వంటలక్కను వదిలేసి డాక్టర్ బాబు తన కూతుళ్లతో ఏం చేస్తున్నాడో చూడండి…!

arun kanna

కరోనా టీకా కొనుగోళ్లలో మనమే ఫస్ట్..! భారీగా టీకాలు కొనుగోలు చేసిన ఇండియా..!!

Vissu

లోక్ సభ లో రేవంత్ రెడ్డి అరెస్టు గురించి చర్చ

Siva Prasad