Sai Pallavi: ఫిదా సినిమా తో తెలుగు తెరకు పరిచయమైంది సాయిపల్లవి.. ఈ ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది కన్నడ బ్యూటీ.. సోషల్ మీడియాలో హీరో, హీరోయిన్స్ చిన్నప్పటి ఫోటోలు పోస్ట్ చేసి ఈ హీరో హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా అంటూ పోస్ట్ చేసిన న్యూస్ మనం చాలానే చూశాం. తాజాగా ఓ చిన్నారి ఫోటో పోస్ట్ చేసి ఇ ఈ ఫోటో లో ఉన్న స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..!? అయితే ఆ ఫోటోలో ఉన్నది ఎవరో కాదు ఫిదా బ్యూటీ సాయి పల్లవి..!!
సాయి పల్లవి చిన్నప్పటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. సాయి పల్లవి చక్కటి కథాంశం ఉన్న పాత్రలనే ఎంచుకుంటుంది. గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉంటుంది.. అయినప్పటికీ ఈ ఈ బ్యూటీకి ఉన్న క్రేజే వేరు.. ప్రస్తుతం సాయి పల్లవి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య సరసన లవ్ స్టోరీ సినిమా లో నటిస్తోంది. ఈ సినిమా నుంచి విడుదలైన సారంగదరియా పాట ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అలాగే విరాటపర్వం సినిమాలో కూడా నటిస్తోంది సాయి పల్లవి.