SaiPallavi Shyam Singarai: ఫిదా సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సాయి పల్లవి.. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఫిదా చేసింది.. ఈరోజు సాయి పల్లవి తన 29వ పుట్టినరోజును జరుపుకుంటోంది.. ఈ సందర్భంగా శ్యామ్ సింగరాయ్ సినిమా నుంచి సాయిపల్లవి ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్..!!
ఈ సినిమాలో నాని సరసన హీరోగా నటిస్తారు సాయిపల్లవి, కృతి శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. కలకత్తా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా కు టాక్సీ వాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వం వహిస్తున్నారు.. ఇటీవల ఈ సినిమా నుంచి నాని ఫస్ట్ లుక్ ను విడుదల చేయగా విశేషంగా ఆకట్టుకుంది. ఈరోజు సాయి పల్లవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ లో కాళికాదేవి గా తన ఉగ్రరూపం చూపిస్తోంది సాయి పల్లవి..
సాయి పల్లవి వేణు ఉడుగుల దర్శకత్వంలో విరాటపర్వం సినిమా చేస్తోంది.. అయితే ఈ సినిమా నుంచి ఈరోజు ఏ అప్డేట్ అవ్వట్లేదు అంటూ డైరెక్టర్ ప్రత్యేకంగా ట్వీట్ చేశారు.. మరోవైపు సాయి పల్లవి నాగచైతన్య సరసన లవ్ స్టోరీ సినిమాలో నటిస్తోంది.. ఈరోజు సాయి పల్లవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి అప్డేట్ రానుంది..
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!