ఎవరికైనా ఆదివారం అంటే చాలా ఇష్టం. వారం అంతా పనిచేసే వారు ఆ ఒక్క రోజు హాయిగా సంతోషంగా రిలాక్స్ అయిపోతారు. కుటుంబంతో గడపడానికో లేదా ఫ్రెండ్స్ తో చిల్ అయ్యేందుకు మొగ్గుచూపుతారు. ఇక సెలబ్రిటీలు అయితే ప్లానింగ్స్ వేరుగా ఉంటాయి. తమ బిజీ లైఫ్ నుండి కొద్దిగా విరామం దొరికితే చాలు వినూత్న రీతిలో ఎంజాయ్ చేయడానికి ఎన్నో రకాల ప్లాన్స్ వేస్తారు.
ఇదే క్రమంలో ఆదివారం మీద ఎన్నో ఆశలు, కోరికలు పెట్టుకుందట సమంత. కానీ తీరా చూస్తే అన్ని కలలుగానే మిగిలిపోయాయి. సమంత ఇప్పుడు చాలా బిజీగా గడుపుతోంది. ఒకవైపు తన ఇంటి డాబా పైన అర్బన్ ఫార్మింగ్ అంటూ కూరగాయలు పండించే వేస్తోంది. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపుతుంది. తనే ఒక మోడ్రన్ రైతు గా మారిపోయింది. మరోవైపు తన చిన్ననాటి కల అయిన ఫ్యాషన్ డిజైనింగ్ లో సొంత బ్రాండ్ కోసం నిర్విరామంగా పని చేస్తుంది. ఇక దానికి తగ్గట్టు వరుసగా చేతిలో బోలెడన్ని సినిమాలు ఉన్నాయి.
అయితే సమంత తన సోషల్ మీడియా ప్రొఫైల్ లో ఆదివారం ఎలా ఎంజాయ్ చేయాలనుకున్నది అని ఒక ఫోటో పెట్టింది. అందులో ఒక అమ్మాయి బాత్ టబ్ లో స్నానం చేస్తూ షాంపేన్ గ్లాస్ పెట్టుకొని ఉంటుంది. అయితే తన ఇంట్లోని కుక్క వల్ల తన ప్లాన్ మొత్తం పాడైనట్లు సమంత తన తరువాతి పోస్ట్‌లో చెప్పుకొచ్చింది. అయితే అక్కినేని వారసుడు నాగచైతన్య ను పెళ్లి చేసుకున్న సమంత కు ఇటువంటి కోరికలు ఉన్నాయా అంటూ నెటిజన్లు నోరెళ్లబెట్టారు. అయితే సమంత నాగచైతన్య మధ్యలో ఉన్న బాండింగ్, అర్థం చేసుకునే విధానం వేరే లెవల్ అని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ ఉంది. అతనికి లేని నొప్పి నీకెందుకు అంటూ ఆమె ఫ్యాన్స్ రెచ్చిపోయారు. అయితే సమంత మాత్రం తన పెట్ చేసిన పనికి బాగా డీలా పడిపోయింది.