Samantha : సమంత అక్కినేని సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..! ఎప్పటికప్పుడు తన సినిమా అప్డేట్స్, వ్యక్తిగత విషయాలను తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది.. తాజాగా ఈ అమ్మడు ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.. అతనే నా అందాల కుమారుడు అంటూ ట్విట్టర్ వేదికగా ఒక వీడియోను విడుదల చేసింది..! ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది..!!
తాజాగా తన అందాల రాకుమారుడు దుశ్యంత్ .. అంటూ శాకుంతలం మూవీ లో దుష్యంతుడి పాత్ర ఎవరు చేస్తున్నారో రివీల్ చేసింది సమంత. ప్రముఖ మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడి గా నటించబోతున్నాడని తెలుపుతూ ఒక వీడియో షేర్ చేసింది. ఈ వీడియో వైరల్ అవుతోంది. గుణశేఖర్ తెరకెక్కించనున్న ఈ భారీ మూవీ తో తన కెరీర్ లో మొదటిసారిగా పౌరాణిక పాత్రలో కనిపించనుంది సామ్. గ్రాఫిక్స్ కి ప్రాధాన్యం ఇస్తూ అత్యున్నత సాంకేతిక విలువ లతో ఈ సినిమా ను రూపొందించనున్నారు. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
Here’s introducing our Prince Charming … DUSHYANT ?? @ActorDevMohanhttps://t.co/cqFNzAUsiI #Shaakuntalam @gunasekhar1 @neelima_guna @gunaateamworks
— Samantha Akkineni (@Samanthaprabhu2) March 6, 2021
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!