కొణిదెల ఉపాసన అపోలో హాస్పిటల్ చైర్ పర్సన్ గా విధులు నిర్వర్తిస్తూ ఆరోగ్యం, మానవ పరిపుష్టి కోసం ఎంతో ప్రాధాన్యత ఇస్తారు అన్న విషయం అందరికీ తెలిసినదే. ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని, వారి జీవన విధానంలో మార్పులు తేవడానికి వారిలో అవగాహన కల్పిస్తూ, యు ఆర్ లైఫ్ అనే యూట్యూబ్ ఛానల్ గత కొద్ది రోజుల నుంచి నడుపుతున్న విషయం అందరికీ తెలిసినదే. ఉపాసన నడుపుతున్న ఈ మాగజైన్ కు సమంత ఎడిటర్ గా నిర్వహిస్తున్నారు. హెల్త్ ఫిట్ నెస్ కోసం సమంత ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.
ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా తక్కాలి సదం, క్యారెట్ ఇడ్లీ బ్రేక్ ఫాస్ట్ ను తయారు చేసి యూట్యూబ్ ఛానల్ ద్వారా పోస్ట్ చేయడంతో ఆ వంటకాలకు ప్రేక్షకుల నుంచి ఎంతో మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే మరోసారి ఈ మ్యాగజైన్ కోసం స్పైస్ అప్ యువర్ లైఫ్ విత్ సామ్ అనే శీర్షిక ద్వారా మంచి కాఫీ తయారు చేసి చూపించారు. అయితే సమంత తాజాగా ఎన్నో పోషక విలువలతో కూడిన వేగన్ ఫిల్టర్ కాఫీ అండ్ చాకొలేట్ చియా సీడ్ మౌస్సే అనే రిసిపిని తయారుచేసే వీడియో తమ యూట్యూబ్ ఛానల్ ద్వారా పోస్ట్ చేశారు.
ఈ కాఫీ ఆరోగ్యాన్ని రక్షించే అంశాలతోపాటు ఎన్నో పోషక విలువలను కలిగి ఉన్నాయి. చీయా సీడ్ లో ఒమేగా 3 పుష్కలంగా లభిస్తుంది. ఈ కాఫీని తాగడం ద్వారా రక్తంలోని చక్కెర వ్యాధిని నియంత్రించడమే కాకుండా, మన శరీరానికి శక్తిని అందించడంలో తోడ్పడుతుంది. మన మెదడు పని తీరును ఎంతో మెరుగుపరచడానికి ఈ కాఫీ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. కేవలం 20 నిమిషాల సమయంలో ఇంతటి ఆరోగ్యకరమైన వేగన్ ఫిల్టర్ కాఫీ తయారు చేసుకోవచ్చని సమంత తెలిపారు. ఆరోగ్యం గురించి ఎప్పుడూ శ్రద్ధ తీసుకునే ఉపాసన ,సమంతను కాఫీ లవర్స్ గా పిలుస్తారు. అయితే ప్రస్తుతం వీరు చేసిన వేగన్ ఫిల్టర్ కాఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాకుండా ఎంతోమంది కాఫీ లవర్స్ మనసును దోచే చేసుకుంటోంది.