Sampoornesh Babu: సినిమా పై పిచ్చి ప్రేమ తో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు సంపూర్ణేష్ బాబు.. హృదయ కాలేయం సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసులో స్థానాన్ని సంపాదించుకున్నాడు.. బర్నింగ్ స్టార్ గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నాడు.. ఈరోజు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు పుట్టినరోజు..!!
సంపూర్ణేష్ బాబు తన బర్తడే సిడిపిని తనే రిలీజ్ చేసుకుంటాను అన్నాడు.. అందరూ ఆశీర్వదించండి.. అంటూ ట్వీట్ చేశారు.. ఇప్పటికి సెలవు పలువురు సినీ ప్రముఖులు సంపూర్ణేష్ బాబు కి బర్త్ డే విషెస్ తెలిపారు ఈరోజు సంపూర్ణేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా బజారు రౌడీ సినిమా నుంచి స్పెషల్ అప్డేట్ రానుంది..
ప్రస్తుతం ‘బజార్ రౌడీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్, పాటలకు విశేష స్పందన లభించింది.. ఈ టీజర్ లో సంపూర్ణ డైలాగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.. ఈ సినిమాలో షియాజీ షిండే, పృద్వి, నాగినీడు, షఫీ ,మనిచందన, నవీన, పద్మావతి, జీవా, సమీర్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వసంత నాగేశ్వర రావు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కీ సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు.. ఈ సినిమాను కె ఎస్ క్రియేషన్స్ పతాకంపై సంది రెడ్డి శ్రీనివాస్ రావు నిర్మిస్తున్నారు.
రేపు నా పుట్టిన రోజు, నా Birthday CDP ని నేనే ఈ రోజు సాయంత్రం 7:30 గంటలకు రిలీజ్ చేసుకుంటున్నాను. అందరూ ఆశీర్వదించండి#HBDSAMPOO
— Sampoornesh Babu (@sampoornesh) May 8, 2021