Santosh Shobhan: ఏక్ మినీ కథ తో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు యంగ్ హీరో సంతోష్ శోభన్.. మొదటి సినిమాతోనే హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. ఈ క్రేజ్ తో వరుస సినిమా ఆఫర్లను అందుకొన్నాడు.. ఇటీవల సంతోష్ శోభన్ నెక్స్ట్ సినిమా “ప్రేమ్ కుమార్” టైటిల్ మోషన్ పోస్టర్ని విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.. తాజాగా శోభన్ మరో సినిమా “అన్నీ మంచి శకునములే” మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్..!!

ఈ చిత్రాన్ని టాలెంటెడ్ లేడీ డైరెక్టర్ నందిని దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. స్వప్న సినిమా, మిత్ర విందా మూవీస్ బ్యానర్లపై ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శోభన్ సరసన మాళవిక నాయర్ నటిస్తోంది. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, నరేష్, వెన్నెల కిషోర్, రావు రమేష్, గౌతమి ప్రధాన పాత్రల్లో పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు. సినిమాటోగ్రఫీ గా సన్నీ కూరపాటి అందిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమా మోషన్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.. త్వరలోనే ఈ సినిమాలో సంతోష్ శోభన్ ఫస్ట్ లుక్ ను ప్రకటించనున్నారు మేకర్స్..