Satish : బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది నటుడు, రచయిత, దర్శకుడైన సతీష్ కౌశిక్ గురువారం కన్నుమూశారు. ఆయన గుండెపోటుకు గురై తుది శ్వాస విడిచారు. దాంతో బాలీవుడ్ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి లోనైంది.. ఈ వార్తను సతీష్ కౌశిక్ కు అత్యంత సన్నిహితుడైన అనుపమ్ కేర్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు..

మరణం అనేది ఈ ప్రపంచంలోనే అంతిమ సత్యం అని నాకు తెలుసు. కానీ నేను బ్రతికున్నప్పుడు నా ప్రాణ స్నేహితుడు గురించి ఇలా రాస్తానని కలలో కూడా ఊహించలేదు. 45 ఏళ్ల స్నేహానికి ఇంత హఠాత్తుగా ముగింపు చెప్పాల్సి వస్తుందని ఏనాడు అనుకోలేదు.. నువ్వు లేకుండా జీవితం ఎప్పటికీ ఒకేలా ఉండదు సతీష్ ఓం శాంతి అంటూ అనుపమ్ కేర్ భావోద్వేగానికి లోనయ్యారు. ఢిల్లీలోని ఓ స్నేహితుని ఇంట్లో ఉన్నప్పుడు తనకు నలతగా ఉందని తెలిపిన ఆయన ఆసుపత్రికి తరలిస్తుండగా గుండెపోటుతో మరణించారని అనుపమ్ కేర్ తెలిపారు. ఆయన మృతి పట్ల అభిమానులు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
హాస్యనటుడిగా, దర్శకుడిగా బాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక ముద్రను వేసుకున్నారు. ప్రముఖ నటుడు అనుపమ కేర్ సతీష్ కౌశిక్ కు అత్యంత సన్నిహితులు. వీరిద్దరూ కలిసి కరోల్ బాఘ్ అనే ప్రొడక్షన్ హౌస్ ని కూడా ప్రారంభించారు. అనుపమ్ నిర్మాతగా సతీష్ దర్శకత్వంలో పలు సినిమాలు వచ్చాయి. వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ అందుకున్నాయి.