29.2 C
Hyderabad
March 21, 2023
NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Savings: కేవలం రూ.5000 పొదుపుతో రూ.16లక్షల రాబడి..!

Share

Savings: పొదుపు చేయాలన్న ఆలోచన ఉండాలి కానీ, ఎన్నో ప్రభుత్వ పథకాలు, పాలసీలు అందుబాటులో ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడాన్ని ఇష్టపడని వారికి ఈ ప్రభుత్వ పథకాలు, పాలసీలు మంచి ప్రత్యామ్నాయం. మీరు దీర్ఘకాలం పెట్టుబడి పెట్టాలనుకుంటే.. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకం అన్నింటికన్నా ఉత్తమమైనది. 15 ఏళ్ల పాటు పెట్టుబడిగా పెడుతూ పోతే.. మెచ్యూరిటీ అనంతరం భారీ మొత్తంలో రాబడి పొందవచ్చు. ఉదాహరణకు నెలకు రూ. 5000 పొదుపుతో 15 ఏళ్ల తర్వాత రూ. 16 లక్షల రాబడిగా పొందవచ్చు. అలాగే.. డబ్బు అవసరమైన సందర్భాల్లో రుణ సదుపాయం, నగదు ఉపసంహరణ, మెచ్యూరిటీ గడువు కంటే ముందే ఖాతాను క్లోజ్ చేసే అవకాశం వంటి ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి..

The woman hand is putting a coin in a glass bottle and a pile of coins on a brown wooden tableInvestment business retirement finance and saving money for future concept

పి.పి.ఎఫ్ పథకం గురించి ఒక మాటలో చెప్పాలంటే.. భవిష్యత్తు కోసం డబ్బు ఆదా చేయడానికి సురక్షితమైన, అత్యంత అనుకూలమైన మార్గాలలో ఇది ఒకటి. ఇందులో చేరితే రిస్క్ లేకుండా ఖచ్చితమైన రాబడి పొందవచ్చు. అంతేకాకుండా రాబడిపై పన్ను మినహాయింపు పొందవచ్చు. మరియు వయోజన భారతీయులు ఎవరైనా ఈ ఖాతా తెరవచ్చును. ఈ పథకం మెచ్యూరిటీ సమయం 15 సంవత్సరాలు. అంటే మీరు ఖాతా తెరిచినప్పటి నుంచి 15 ఏళ్ల తర్వాత మెచ్యూరిటీ ఉంటుంది. కావున ఈ మెచ్యూరిటీ కాలాన్ని పొడిగించాలంటే మరో ఐదేళ్ల చొప్పున పొడిగించుకుంటూ వెళ్లొచ్చు.

ఈ పథకంలో ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500
గరిష్టంగా రూ.1.5 లక్షలు డిపాజిట్ చేయాలి. మీ వద్ద అంత మొత్తంలో నిధులు లేకపోతే కనీసం రూ.100 మొత్తంతో ఖాతా ఓపెన్ చేయవచ్చు. మీ ఆదాయం పెరిగాక అందుకు అనుగుణంగా కాంట్రిబ్యూషన్ పెంచుకోవచ్చు. ప్రస్తుతం పిపిఎఫ్ ఖాతా పై 7.1 % వార్షిక వడ్డీ అందుతుంది. అంతేకాకుండా ఈ వడ్డీని ప్రతి ఆర్థిక సంవత్సరం చివరన లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. ఏదైనా ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500 జమ చేయని పక్షంలో పిపిఎఫ్ ఖాతా నిలిచిపోతుంది. నిలిచిపోయిన కథపై లోన్ గాని, నగదు ఉపసంహరణ విసులుబాటుగా ఉండదు. ప్రతి ఏడాదికి కనీసం రూ.500 చొప్పున జమ చేయాల్సి ఉంటుంది.


Share

Related posts

ఏపిలో వ్రాతపరీక్ష లేకుండా పదో తరగతి, డిప్లొమా, డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు

somaraju sharma

బతికున్నంతకాలం వై ఎస్ చేద్దాం అనుకున్నది జగన్ రాత్రికి రాత్రి చేసేశాడు !

sridhar

పీసీసీ పీఠంపై రేవంత్ రెడ్డి … జ‌గ్గారెడ్డి ఇదే చెప్తున్నారా?

sridhar